“యూత్” చిత్ర రివ్యూ & రేటింగ్

కెన్ కరుణాస్ స్వీయ రచన దర్శకత్వంలో తానే కథానాయకుడిగా నటిస్తూ కర్రుపై నిర్మాతగా జీవి ప్రకాష్ సంగీతం అందించిన చిత్రం యూత్. ఈ చిత్రంలో అనిష్మ అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్ మీనాక్షి దినేష్ హీరోయిన్లుగా నటించిన దేవదర్శిని, సూరజ్, అబిసన్ తదితరులు కీలకపాత్ర పోషించారు. విక్కీ సినిమాటోగ్రఫీ అందించగా గతవారం తమిళ్లో విడుదలై మంచి విజయాన్ని అందుకొని నేడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే….

 

కథ :

ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు తన జూనియర్ కాలేజీలో చదివే యవ్వన వయసులో ఉండగా తనకు ఉండే అందరిలాంటి సాధారణమైన ప్రేమ పట్ల ఇష్టం అలాగే కుటుంబ పరిస్థితులు మధ్య జరిగే ఎమోషన్ తో ఉండే కథగా ఉంటుంది. అయితే ఆ యువకుడు తాను అనుకున్నా ప్రేమను పొందుతాడా లేదా? అతని ప్రేమకు వచ్చిన సమస్యలు ఏంటి? ఆ సమస్యలను అతను ఎదుర్కొంటాడా లేదా ఆ సమస్యల వల్ల వెనకడుగు వేస్తాడా? తన కుటుంబ పరిస్థితులు తనను ఎలా మారుస్తాయి? చివరికి అతను ఏం సాధిస్తాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఏ సినిమా చూడాల్సిందే.

 

నటీనటులు నటన :

కెన్ కరుణాస్ గతంలో ఎన్నో చిత్రాలలో వివిధ పాత్రలలో కనిపించినప్పటికీ చిన్న వయసులోనే హీరోగా కనిపించడంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే విధంగా ఈ సినిమాలో అతని నటన అద్భుతంగా అందరిని మెప్పించేలా ఉంది. అలాగే చిత్రంలో హీరోయిన్లుగా నటించిన ముగ్గురు అమ్మాయిలు అనిష్మ అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్ మీనాక్షి దినేష్ తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ ఒకరికి ఒకరు పోటీగా తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు. ఎన్నో చిత్రాలలో ఎన్నో వివిధ పాత్రలలో కనిపించిన దేవదర్శిని, సూరజ్ ఈ సినిమాలో కాస్త భిన్నమైన పాత్రలలో అద్భుతంగా నటించారు. అలాగే సినిమాలో నటించిన పాత్రలో పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్గా నిలిచారు.

 

సాంకేతిక విశ్లేషణ :

తొలి దర్శకత్వం అయినప్పటికీ తాను రాసుకున్న కథను ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా అలాగే ప్రేక్షకులు అంతా చాలా ఎంజాయ్ చేసే విధంగా నటిస్తూనే దర్శకత్వం చేయడం అనేది చాలా పెద్ద విషయం. అటువంటి ఎంతో పెద్ద బాధ్యతను చాలా స్మార్ట్ గా చేస్తూ దర్శకుడిగా కెన్ కరుణాస్ ప్రేక్షకులను మెప్పించారు. అలాగే సినిమా అంతటని కళ్ళకు కట్టినట్లు చూపించడంలో సినిమాటోగ్రాఫర్, ప్రతి సీన్ లోని విజయంతో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా ఇంకా పాటలను మనసుకు నచ్చే విధంగా సంగీతాన్ని అందించి జీవి ప్రకాష్ విజయం సాధించారు. కలరింగ్ చిన్నపాటి వి ఎఫ్ ఎక్స్ లొకేషన్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు అనిపించకుండా చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :

కథ, దర్శకత్వం, నటీనటుల నటన, పాటలు, బిజిఎం.

 

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ డబ్బింగ్ కుదరకపోవడం.

 

సారాంశం :

ఈ సమ్మర్ కు యువతతో పాటు కుటుంబ సమేతంగా చూసి అటు ఎంటర్టైన్ గా ఫీల్ అవుతూ ఇటు కుటుంబ విలువలను అలాగే జీవితంలో ఇవ్వడం వయసును ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెబుతూ ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన చిత్రం యూత్.

రేటింగ్ : 3/5

Previous articleఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ 2026 లో శ్రీ నందమూరి బాలకృష్ణ గార్కి  “లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here