కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ చేరారు. సీతానగరం కొండపై కొలువైన విజయకీలాద్రిని దర్శించుకున్నారు. అనంతరం. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రెండ్రోజులుగా పవన్ నిఫర్ తుపానులో నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపించారు. ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిల తీరుపై విరుచుకుపడ్డారు. జనసేనాని మాటల దాడికి ఉలిక్కిపడిన వైసీపీ నేతలు.. పవన్ను వ్యక్తిగతంగా దూషించేందుకు సిద్ధమయ్యారు. కొడాలి నాని తనదైన పాత శైలిలోనే బూతుల పంచాంగం అందుకున్నారు.