పెళ్లిసందడి గుర్తు ఉండే ఉంటుంది.. 1996లో స్వప్నసుందరీ అంటూ పలుకరించిన రాఘవేంద్రుడి మాయాజాలం. శ్రీకాంత్‌ను హీరోగా మరో మెట్టుపై నిలిపింది. సున్నితమైన హాస్యం.. అద్భుతమైన పాటలతో కీరవాణి మ్యాజిక్ చేశారు. ఇప్పుడు అదే సినిమా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపుదిద్దుకోబోతుంది. హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా నటించబోతున్నారు. గౌరి రోణంకి దర్శకత్వంలో రాబోతున్న కొత్త పెళ్లిసందడిపై సినీవర్గాల్లో ఆసక్తి కరమైన చర్చ మొదలైంది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో కనిపించటమే.. తెలుగు సినిమా ప్రేక్షకులకు తండ్రీ కొడుకులు ఒకే సినిమాలో కనిపించటాన్ని భలే ఆస్వాదిస్తారు. ఎన్టీఆర్ బాలయ్య, నాగేశ్వరరావు నాగార్జున, చిరంజీవి రామ్‌చరణ్ తేజ్ ఇలా స్టార్ హీరోలందరూ వారసులతో నటించారు ఇప్పుడు అదే బాటలో శ్రీకాంత్, రోషన్ కలయిక కూడా. ఆ నాడు సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచిన పెళ్లిసందడి ఇప్పుడు తనయుడు ద్వారా మరింత హిట్ కొట్టాలని శ్రీకాంత్ భావిస్తున్నారట.