ఆమె పేరు డాక్టర్ పచ్చిపాల నమ్రత. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో విశాఖ, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో పేద్ద ఆసుపత్రులు ప్రారంభించింది. పిల్లల్లేని దంపతులకు వైద్యం అందిస్తుంది. సరోగసీ.. అంటే అద్దెగర్భాలతో గుట్టుగా వ్యాపారం సాగిస్తుంది. ఎంత సంపద ఉన్నా.. అమ్మానాన్న కాలేని భార్యభర్తల బాధను తీర్చే మాతృమూర్తిగా అవతారమెత్తింది. ఇదంతా నాణేనికి ఓ వైపు.. మరోవైపు.. ఫెర్టిలిటీ సెంటర్‌లో శిశువిక్రయాలు జరుగుతున్నాయి. అవాంఛిత గర్భదారణ చేసిన వారిని గుర్తించటం… వారికి కాన్పు చేసేందుకు ఆసుపత్రికి తీసుకురావటం చేస్తుంటారు. ఈ పాపంలో ఆసుపత్రిలో పనిచేసే నర్సులు, ఆశావర్కర్లు ఇలా కమీషన్లకు ఆశపడిన వారంతా పాత్రదారులు. ఇలా.. ఇష్టంలేని సంతానాన్ని ఎంతోకొంత ఇచ్చి కొనుగోలు చేస్తారు. ఆ పసిగుడ్డులను సంతానంలోపం ఉన్న భార్యభర్తలకు విక్రయిస్తుంటారు. డాక్టర్ నమ్రత కనుసన్నల్లో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న బిడ్డల అమ్మకాల గుట్టు.. ఈ మధ్య విశాఖలో ఓ ఘటనతో వెలుగుచూసింది. హైదరాబాద్‌లోనూ సరోగసీ ద్వారా భార్యభర్తల నుంచి వీర్యం, గుడ్డు సేకరించి మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టి.. బిడ్డలు కలిగేలా చేస్తామంటూ.. ఓ జంట నుంచి
ఏకంగా రూ.10లక్షల వరకూ వసూలు చేసిందట. ఇప్పుడు విశాఖలో డాక్టరమ్మ చీకటి భాగోతం బయటకు రావటంతో ఇప్పుడా
దంపతులు.. తాము కూడా మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. సంతానం లేని దంపతుల ఆశను అవకాశం చేసుకుని ఈ లేడీడాక్టరమ్మ.. కిలాడీ మారి సొమ్ము చేసుకోవటం.. వైద్యవృత్తికి కళంకంగా వైద్యవర్గాలు ఆందోళన వెలిబుచ్చుతున్నాయి.