నిల్వ పచ్చళ్ళు అనారోగ్యమా? ఔషధమా?

మనము వేసవిలో ఎక్కువగా నిల్వ పచ్చళ్ళు పెట్టడం ఆచారం… పూర్వం, అంటే 50 సంవత్సరాల క్రితం వరకు ప్రతి ఇంటిలో సుమారుగా, పచ్చడి అన్నం 70 శాతం, కూర అన్నం 30 శాతంగా తినేవారు. అయినా వారు చాలా చాలా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించి ఉన్నారు. దీనికి గల కారణం, వారు పచ్చడిలో వాడిన పదార్థముల ఔషధీ గుణాలు.

పచ్చడిలో కచ్చితంగా అన్నీ న్యాచురల్ / ఆర్గానిక్ పదార్ధములు మాత్రమే వాడాలి. కారం ,పసుపు,మెంతిపిండి, ఆవపిండి ,సముద్రపు ఉప్పు, గానుగ నూనెమరియు ఇంగువ లు అనేక అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న పదార్థములు.

పచ్చడికి సంబందించిన కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం….

కారము: ఇది రక్తనాళాలు గడ్డకట్టకుండా కాపాడి, రక్తప్రసరణ సవ్యంగా జరుగుటకు దోహదం చేయును. తద్వారా గుండెకు సంబంధించిన రోగములు రాకుండా కాపాడును.దీనిలో విటమిన్ ఎ, బి,సి పుష్కలంగా ఉంటాయి.

పసుపు: మన భారతీయ సనాతన సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం.దీనిలో కుర్కుమిన్ అనే ఒక రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరిచే గుణం ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా దోహదం చేస్తుంది.

గానుగ నూనెలు: గానుగ నూనెలలో( పల్లి నూనె&నువ్వుల నూనె) ఉండే ఎంజైమ్స్,లిపిడ్ గుణాలను శరీరము మెరుగ్గా సంగ్రహించే విధముగా చేస్తుంది..

మెంతిపిండి: జీర్ణవ్యవస్థను సక్రమంగా చేసి క్లోమము సక్రమంగా వృద్ధిచేస్తుంది.

సముద్రపు ఉప్పు: నాన్ అయొడైజ్డ్ సాల్ట్ :పచ్చడి నిల్వ సామర్థ్యం చాలా చక్కగా ఉంటుంది. అంతే కాకుండా మన తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే వ్యవస్థ ఉంటుంది. మన శరీరానికి కావల్సిన అత్యంత శక్తివంతమైన అటువంటి కొన్ని సుగుణాలు పొటాషియం లాంటివి దీంట్లో మెరుగ్గా ఉంటాయి.

ఇంగువ: ఇది తిన్న ఆహారాన్ని సరిగా జీర్ణమై, రక్తంలో శక్తిగా మారుటకు ఉపయోగంగా ఉంటుంది.

పచ్చడి లో వాడే ఆహార పదార్ధములలో ఇన్ని ఔషధీ గుణాలు ఉన్నప్పటికీ, వాటిని పండించే విధానం లో విపరీతమైన విషపూరిత రసాయనాలు వాడడం వలన, శరీర ఆరోగ్య వ్యవస్థను కాపాడవలసిన ఆహార పదార్థాలు, మన ఆరోగ్యాన్ని విపరీతంగా నిర్వీర్యం చేస్తున్నాయి.

ఉదాహరణకి ఒక మిరపపంట కాలవ్యవధిలో, అంటే తొమ్మిది నెలల వ్యవధిలో, సుమారుగా 40 సార్లు పురుగు మందులు వాడతారు.

అందువలన మనము పచ్చడి ద్వారా ఆరోగ్యాన్ని పొందాలంటే, ఖచ్చితముగా విష రసాయనాలు వాడకుండా పండించిన పదార్థాలు మాత్రమే వాడాలి.

ఒక సంవత్సరంలో ఒక కుటుంబం మొత్తానికి కావలసిన కారము మరియు పసుపు సుమారుగా 3నుంచి 5 కేజీలు మాతమే.

కావున మీరందరూ, కారం, పసుపు, మెంతులు, గానుగ నూనెలు మరియు ఆవాలను మీకు దగ్గరలోని ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల నుంచి /ఆర్గానిక్ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయటానికి ప్రయత్నించండి. ఈ విధంగా చేసిన యెడల అది మనకు ఆరోగ్యంగా ఉండును. మరియు రైతులకు కూడా చేయూత అందించ వచ్చును.

ఒకవేళ ఆ విధముగా మీకు లభ్యత లేనియెడల, జనహిత న్యాచురాల్ ఫార్మ్స్ /బాధ్యతా ఫౌండేషన్ రైతు విభాగాన్ని సంప్రదించండి. (ఇది ఒక సేవా సంస్థ )

జనహిత న్యాచురల్ ఫార్మ్స్/బాధ్యతా ఫౌండేషన్ రైతు విభాగం యొక్క నెంబరు 8008 42 43 44.

ఈ మంచి ఆరోగ్యకరమైన విషయాన్ని దయచేసి షేర్ చేయండి….🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here