ఎఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకు కరోనా వైద్యపరీక్ష నిర్వహించారు. శనివారం చార్మినార్ వద్దగల యునానీ ఆసుపత్రికి వచ్చిన ఆయన కొవిడ్ 19 పాజిటివ్ వైద్యపరీక్ష చేయించుకున్నారు. హైదరాబాద్‌లో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ అందరూ వైద్యపరీక్షలకు కదులుతున్నారు. తనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు ట్వీట్టర్ ద్వారా అసదుద్దీన్ వెల్లడించారు.