కరోనా భాదితులకు చికిత్స అందించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల అదనంగా ఖర్చు పెట్టటానికి సిద్ధం గా ఉందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆసుపత్రుల సంఖ్యను పెంచటానికి,వైద్య సిబ్బందిని నియమించటానికి మరియు ఇతర మౌలిక వసతులను కల్పిచటానికి ఈ మొత్తాన్ని వచ్చే ఆరు నెలల్లో ఖర్చు చేయటానికి ప్రణాళిక రూపొందిచినట్లు జగన్ చెప్పారు. ఒక్కొక్క కోవిడ్ పేషెంట్ కి రూ. 35 వేలు ఖర్చు అవుతున్నప్పటికీ వైద్యం అందించటం లో వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఆక్సిజన్ సిలెండర్లు, ఐసీయూ వార్డులు, క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ సంఖ్య గణనీయంగా పెంచామన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు రోజుకి రూ. 5 కోట్లు ఖర్చు అవుతుందని కూడా తెలిపారు