కానిస్టేబుల్ కొడుకు క‌లెక్ట‌ర‌య్యాడు!

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ కానిస్టేబుల్. పిల్ల‌ల‌కు చ‌దువు చాలు అనే ఉద్దేశంతో ప్రోత్స‌హించాడు. దాన్ని నిజం చేస్తూ ఆయ‌న కుమారుడు డి. వినయ్ కాంత్, వయస్సు 29 సంవత్సరాలు సివిల్స్‌లో టాప్ ర్యాంక్ సాధించాడు. ఏడాది క్రిత‌మే రాజ్య‌స‌భ సెక్రెటరీ సెక్రటేరియట్ (AEO) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేరారు. విధులు నిర్వహిస్తూ, సివిల్స్ కు సిద్ధ‌మ‌య్యాడు. తాజాగా ప్రకటించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫలితాల్లో 516 ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ ను అభినందించారు. పిల్లలు ఏ రంగంలో ప్రావీణ్యత ఉంటుందో ఆ రంగంలో ఉన్నత శిఖరాలు చేరేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.

Previous articleఅమ్మాయిలూ మోసగాళ్ళున్నారు జాగ్రత్త !!!!
Next articleక‌రోనాను ఇలా ఎదిరిద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here