తెలంగాణలో 2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు, 2020లో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ ఎంసీలో మెరుగైన సీట్లు వెరసి బీజేపీలో ఉత్సాహం పెరిగింది. ఇదే ఊపులో రేపు జరిగే నాగార్జునసాగర్ ఉప ఎన్నికను కూడా నెగ్గాలనే ఉబలాటంలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో.. బీజేపీను అధికారంలోకి తెస్తామని చెబుతున్న సోము వీర్రాజుకు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బెటర్ అనిపించింది. తెలంగాణలో హిందుత్వ నినాదం తీసుకెళ్లటంలో బండి సంజయ్ తనకు ఇచ్చిన అధ్యక్ష పదవి సరైనదని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజ వంతు వచ్చింది. తిరుపతి ఉప ఎన్నిక రత్నప్రభ గెలుపు ఇప్పుడు బీజేపీ ముందే కాదు సోమన్నకు సవాల్‌గా మారిందనే చెప్పాలి. తిరుపతి ఉప ఎన్నిక వైసీపీకు నల్లేరు మీద నడకలాంటిది. అధికారంలో ఉన్నారు. జనంలోనూ అంత వ్యతిరేకత లేదు. ప్రతిపక్షంగా టీడీపీ బలంగా లేదనేది సత్యం. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో బీజేపీ తిరుపతిలో గెలవాలనుకోవటం గొర్రె తోక పట్టుకోని గోదారి ఈదినట్టే. కానీ.. ఇక్కడే జనసేన పార్టీ రూపంలో బీజేపీ గెలిచినా ఓడినా.. పరవు కాపాడేందుకు అభయం ఇచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెలుపులో ఇదే కీలక మలుపు. అప్పటి వరకూ పొత్తు ఉన్నా బీజేపీ నేతలు జనసేనను చాలా తక్కువగా చూడటం.. అస్సలు తమకు ఎవరు మద్దతు లేదని నోరుజారటంతో జనసేనాని చివరి నిమిషంలో అలా ఝలక్ ఇచ్చారు. ఇది ఏపీలోనూ ప్రభావం చూపుతుందని అంచనా వేసుకున్నా.. తిరుపతి బరిలో బీజేపీ గెలుపులో జనసైనికులు మాత్రమేకాదు.. అక్కడబలిజలు కూడా
ఏకతాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించారు. దీంతో వైసీపీ పరిస్థితి ఇరకాటంలో పడినట్టయింది. తిరుపతి పార్లమెంటరీ స్థానంలో యాదవ, బలిజ, ఎస్సీలు కీలకం.. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు బలిజలు, బీసీలు, మైనార్టీ వర్గాల్లోనూ అభిమానులున్నారు. ఇవన్నీబీజేపీను ఊపిరి పీల్చుకునేలా చేశాయి. వైసీపీ నేతల దౌర్జన్యాలను గట్టిగా ప్రశ్నించే శక్తి పవర్ స్టార్‌కు మాత్రమే ఉందనేది ఇప్పటికే ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుంది. టీడీపీ నేతలు చేతులు ఎత్తేస్తున్న వేళ జనసేనకు ఇంతటి ఆదరణ రావటం మున్ముందు వైసీపీను ఎదుర్కోనే శక్తి జనసేనకే అనేది మాత్రం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం తెలియజేసింది.