వ‌కీల్‌సాబ్ రికార్డులు బ‌ద్ద‌లే!

ప‌వ‌న్ క‌ల్యాణ్ .. ఆ పేరే వైబ్రేష‌న్‌. ఫ్యాన్స్‌లో తెలియ‌ని ఎమోష‌న్‌. అక్క‌డ అబ్బాయి ఇక్క‌డ అమ్మాయితో 24 ఏళ్ల క్రితం వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన క‌ళ్యాణ్‌బాబు పీఎస్ పీకేగా ఇప్పుడు అభిమానుల‌కు దేవుడుగా మారేంతగా ఎదిగారు. ఇది కేవ‌లం సినిమాలు హిట్లు.. సూప‌ర్ హిట్లు కావ‌టం వ‌ల్ల మాత్ర‌మే సాధ్యం కాలేదంటారు సినీ పండితులు. అంత‌కు మించి ప‌వ‌న్ వ్య‌క్తిత్వం, న‌డ‌వ‌డిక‌, ముక్కుసూటిత‌నం, నిజాయ‌తీ, సాటి మ‌నిషి ప‌ట్ల చూపే మాన‌వ‌త్వం ఇవ‌న్నీ ఆయ‌న్ను ఎవ‌రూ ఊహించ‌లేనంత ఎత్తుకు చేరేలా చేశాయి. మూడేళ్ల త‌రువాత సినిమాతో వ‌స్తున్న ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ మ‌న‌సు పెట్టి చేశారు. ఏ సినిమాకు క‌ష్ట‌ప‌డని విధంగా శ్ర‌మ‌కోర్చారు. జ‌న‌సేన పార్టీతో జ‌నాల్లో విస్త్రుతంగా తిర‌గ‌టం.. ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌టం ప్ర‌త్య‌ర్థుల‌ను గుక్క తిప్పుకోలేనంత‌గా మాట‌లు. . విమ‌ర్శ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేయ‌టం త‌ట్టుకోలేక‌పోతున్నారు. మొన్న‌టి ఏపీ పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప‌ట్ల జ‌నాల్లో ఎంత క్రేజ్ ఉంద‌నేది ఓట్ల ద్వారా చూపారు. అదే ఇప్పుడు ప‌వ‌న్ వైరి వ‌ర్గానికి మింగుడు ప‌డ‌కుండా ఉంది. ప‌వ‌న్‌ను విమ‌ర్శించేందుకు ప‌నిక‌ట్టుకుని మ‌రీ కాపు నేత‌లు ముందుకు వ‌స్తున్నారు. పేర్నినాని, అంబ‌టి రాంబాబు వంటి వైసీపీ నాయ‌కుల గెలుపు వెనుక కాపు ఓట‌ర్లు కీల‌క పాత్ర పోషించారు. అటువంటిది ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌టం.. ప్ర‌తి మాట‌నుత‌ప్పుబ‌ట్ట‌డం.. జ‌న‌సేనానిని వ్య‌క్తిగ‌తంగా దూషించ‌ట వంటివి కాపులు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. దీంతో కాపులు, మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు ఏక‌తాటిపైకి రావ‌టం ద్వారా ప‌వ‌న్‌ను బ‌ల‌ప‌రుస్తున్నారు.

దీనికి వ‌కీల్‌సాబ్‌కు ఏమిటీ సంబంధం అనుకోవ‌చ్చు. సినిమాను హిట్‌, సూప‌ర్ హిట్లు చేయ‌టం ద్వారా ప్ర‌త్య‌ర్థుల నోళ్లు మూయించ‌టం. జ‌నాల్లో ప‌వ‌న్ అంటే ఏమిట‌నే స‌త్తాచూప‌టం కూడా దీనిలో భాగ‌మే. అందుకే ఏప్రిల్ 9న ఏపీ, తెలంగాణ‌ల్లో సుమారు 1000కు పైగా థియేట‌ర్ల‌లో వ‌కీల్‌సాబ్ రిలీజ్ కాబోతుంది. అయితే.. పింక్ చూశాక‌.. ప్రేక్ష‌కులు ఎందుకు వ‌స్తార‌నే పేటిఎం బ్యాచ్ అనుమానాల‌ను వ‌కీల్‌సాబ్ రికార్డులే స‌మాధానం చెబుతాయ‌ట‌. వ‌కీల్‌సాబ్ కు ఏపీలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌కూ ద‌గ్గ‌ర స్వ‌రూపం ఉంది. పైగా ప‌వ‌న్ ఉద్య‌మ‌కారుడుగానే జ‌నం ఇష్ట‌ప‌డుతున్నారు. ఆయ‌న వేగం.. దూకుడు మాత్ర‌మే యూత్‌ను ఆయ‌న వైపుకు తిప్పుకుంటున్నాయి. ఇవ‌న్నీ వ‌కీల్‌సాబ్ ద్వారా మ‌రోసారి జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు జ‌న‌సైనికుల‌కు అవ‌కాశం దొరికిన‌ట్ట‌యింది. కీల‌క‌మైన స‌మ‌యంలో సినిమా విడుద‌ల కావ‌టం ప‌వ‌న్‌కు రాజ‌కీయంగా కూడా బాగా క‌ల‌సి వ‌చ్చే అంశం. వ‌కీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుక‌లో ప‌వ‌న్ ఇదేచెప్పారు. సినిమా అనేది త‌న‌కు అవ‌స‌రం.. వేలాది మందికి ఉపాధి క‌ల్పించే మార్గ‌మ‌ని చెప్పారు. సిమెంట్ ఫ్యాక్ట‌రీలు, పేకాట క్ల‌బ్‌లు ఉన్న వాళ్లు రాజ‌కీయాల్లోకి వ‌స్తే తప్పులేదు కానీ.. సినిమాలు చేసుకుంటూ రాజ‌కీయాలు చేయ‌టం త‌ప్పేమిటంటూ త‌న‌ను విమ‌ర్శించే డ‌కోటా బ్యాచ్‌కు గ‌ట్టిగానే స‌మాధాన‌మిచ్చారు. పైగా తాను ఎంత ఎదిగినా.. త‌గ్గే ఉంటాన‌నేందుకు.. ద‌ర్శ‌కుడు శ్రీరామ్‌.. త‌న‌కు వ‌కీల్‌సాబ్‌లో అవ‌కాశం ఇవ్వ‌టం అదృష్ట‌మంటూ ప‌వ‌న్ చెప్ప‌టం అంద‌ర్నీ క‌ద‌లించింది. సినిమాలో అవ‌కాశాలు రావాలంటే టాలెంట్ ఒక్క‌టే చాలంటూ అద్భుతంగా ప్ర‌సంగించారు. సినిమా హిట్ కొట్టేందుకు హీరో ఒక్క‌డే కాద‌ని.. సినిమాలో ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రి భాగ‌స్వామ్యం ఉంటుంద‌టూ చాలా గొప్ప‌గా చెప్ప‌టం వేదిక‌పై ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలించింది. ఇంత‌గా మ‌న‌సు పెట్టి చేసిన వ‌కీల్‌సాబ్ ట్రైల‌ర్‌తోనే రికార్డులు సృష్టిస్తే.. రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు చెరిగిపోతాయ‌నేది ఏప్రిల్ 9 తేలనుంద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here