కుర్రోళ్లు ప్లాస్మా దానం చేస్తున్నారు!

ఎంతైనా ఉడుకు నెత్తురు.. చుట్టూ ఉన్న‌వారికి సాయం చేయాల‌నే గొప్ప ఆలోచ‌న‌లు. క‌రోనా భారీ నుంచి బ‌య‌ట‌ప‌డ‌గానే.. ఏ మాత్రం సంకోచించకుండా ఆప‌ద‌లో ఉన్న క‌రోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. ప్లాస్మా దానం చేస్తూ ఎంతోమందికి ప్రాణాల్ని త‌మ ర‌క్తంలోని ప్లాస్మా ద్వారా కాపాడుతున్నారు. సైబ‌రాబాద్, రాచ‌కొండ‌ పోలీసులు చేప‌ట్టిన ఈ ఉన్న‌త య‌జ్ఞంలో ఇప్ప‌టి వ‌ర‌కూ 229 మంది దానం చేశారు. మ‌రో 1000 మంది వ‌ర‌కూ మేమున్నామంటూ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నాఉ. ఇంత‌కు మించి ఇంకే కావాలి. క‌రోనా రాగానే కుదేలై… బాబోయ్ అంటూ భ‌య‌ప‌డి బెంబేలెత్తే రోజులు పోయాయి. వైర‌స్ త‌గ్గ‌గానే ప్లాస్మా దానం చేస్తాం.. సామాజిక సేవ‌లు మా వంతు తోడ్పాటును అందిస్తామంటున్న నేటి యువ‌త‌రం స్పూర్తికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎవ‌రైనా ప్లాస్మా దానం చేయాల‌న్నా.. ఆప‌ద‌లో ఉన్న‌వారికి ప్లాస్మా అవ‌స‌ర‌మైనా సైబ‌రాబాద్ పోలీసుల‌ను సంప్ర‌దించండి అంటున్నారు పోలీసు క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్‌.

వివ‌రాల‌కు: Cyberabad Police and SCSC are conducting regualr blood/plasma donation drives across Hyderabad, Rachakonda and Cyberabad. Requested public to come forward donate blood by entering your details in the dedicated portal link. Register at https://donateplasma.scsc.in/. Contact Cyberabad Covid Control Room: 9000257058, 9490617440

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here