కరోనా కాలంలో గుండెజబ్బు (కార్డియోవాస్కుర్) పెరుగుదల
కోవిడ్`19 వైరస్ 80% కేసులో ఎలాంటి లక్షణాలు బయటపడడం లేదు
రోటీన్‌గా చేసే పరీక్షలలోనే బయటపడుతున్నాయి, లక్షణాలు బయటపడితే కనుక – అవి ఇలా ఉండవచ్చు
కార్డియో వాస్కుర్ లక్షణాలు ఇలా ఉండవచ్చు :
· గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం మూసుకుపోవడం వలన అక్యూట్ ఎమ్‌ఐ – స్టెమి (అక్యూట్ హార్ట్ అటాక్) ఏర్పడవచ్చు.
· మైక్రో వాస్కులర్ అబ్‌స్ట్రక్షన్ – స్టెమి మిమిక్స్ (ఇసిజి హార్ట్ అటాక్, కానీ నిజమైన హార్ట్ ఎటాక్ కాదు)
· లక్షణాలు కనిపించని ట్రొపొనిన్ ఎలివేషన్ (హార్ట్ ఎటాక్‌లో సాధారణంగా సంభవించే బ్లడ్ ఎంజైమ్ పెరుగుదల)
· కార్డియో మయోపతి (గుండె కండరాల బలహీనత) లేదా వృద్దులలో గుండెపోటు వంటి అంతకు ముందే ఉన్న గుండె సంబంధిత సమస్యలు – సమస్యను తీవ్రతరం చేస్తాయి ` శ్వాసతీసుకోవడంలో తీవ్ర సమస్యలు ఎదుర్కోవడం మరియు ఊపిరితిత్తులో ద్రవ లు చేరడం (పల్మనరీ ఎడెమ)
· డైరెక్ట్ మయోకార్డియల్ ఇన్‌వాల్వ్‌మెంట్ ` మయోకార్డిటిస్ ` కార్డియోజెనిక్ షాక్ ` గుండె కండరాలో ఇన్‌ఫెక్షన్ మరియు మంట మరియు వాపు బ్లడ్ పంపింగ్ వైఫల్యానికి దారితీస్తుంది మరియు రక్తపోటు తగ్గిపోతుంది మరియు షాక్ ఏర్పడుతుంది
· ఎక్కువగా గుండెలో మంట/ రోగనిరోధక క్రియాశీలత / రక్తంలోకి పెద్దఎత్తున రోగనిరోధకత సైటోకైన్‌నులు విడుదల కావడం ` షాక్ ` జ్వరం మరియు ఇతర లక్షణాల వలన రక్తపోటు నమోదు కాబడదు.
· శరీరంలో ఒకేసారి అనేక అవయవాలు వైఫ్యల్యం / తీవ్ర మూత్రపిండాల వైఫ్యల్యం / కాలేయ వైఫ్యల్యం
· పెరికార్డియల్ ఇన్వాల్వ్‌మెంట్ ( గుండెపై ఇన్‌ఫెక్షన్ మరియు ఇన్‌ఫ్లేషన్ పొర) – ఎఫ్యూజన్ / టాంపొనేడ్ (గుండె చుట్టూ ద్రవం ఏర్పడడంతో తక్కువ రక్తపోటు మరియు షాక్.
· అరిథ్మియాస్ – గుండె అసాధారణంగా కొట్టుకోవడం – గుండె పై కవాటా నుండి మినోట్ రకాలు ఉత్పన్నం కావడం ` హార్ట్ అట్రియా ` ఆట్రియల్ ఎక్టోపిక్ బీట్స్ లేదా ఆర్టియల్ ఫ్రైబ్రిలేషన్ – చాలా సాధారణం కానీ తక్కువ ప్రమాదకరం : వెంట్రిక్యుర్ అరిథ్మియాస్ – గుండె కింది కవాటాలు మరియు గుండె కండరాలు అసాధారణంగా కొట్టుకోవడం – వెంట్రిక్యుర్ టాచికార్డియా అంటారు లేదా ఫ్రైబ్రిలేషన్ అంటారు మరియు ఆకస్మిక కార్డియాక్ మరణం – అదృష్టవశాత్తు ఇది అంత సాధారణమైనదేమి కాదు అయితే చాలా ప్రమాదకరమైనది.
· ఊపిరితిత్తుల సమస్య మరియు రక్తంలో ఆక్సిజన్ కలిసే సమస్య కారణంగా – రక్తంలో నిరంతర ఆక్సిజన్ సంతృప్తత (హైపోక్సియా) – ఇది చాలా తక్కువకు పడిపోయినప్పుడు ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది.
· థ్రొంబొఎంబాలిక్ సమస్యలు శరీరంలో – సాధారణ రక్తప్రసరణలో మరియు రక్తం గడ్డకట్టే ప్రక్రియలో అసమతౌల్యం కారణంగా అసాధారణంగా రక్తం గడ్డకట్టడం లేదా స్రావం కారణంగా కాళ్లు మరియు ఇతర శరీర భాగాలలో రక్తం గడ్డకట్టి తద్వారా ఆకస్మాత్తుగా ఊపిరితిత్తులలో అడ్డంకి ఏర్పడుతుంది ` దీనిని మాసివ్ పల్మనరీ (లంగ్) క్లాటింగ్ ` పల్మనరీ థ్రొంబో ` ఎంబోలిజమ్ మరియు గుండె కుడివైపు వైఫల్యం మరియు తక్కువ రక్తపోటు మరియు ఆకస్మిక మరణం సంభవిస్తుంది.
· మెదడు రక్తనాళాలో అసాధారణ రీతిలో రక్తం గడ్డకట్టడం, ఆకస్మిక పక్షవాతం (శరీరం ఒక వైపు బలహీనత) లేదా ఒక చేయి లేదా కాలు లేదా ముఖంలో ఒక వైపు బలహీనతకు దారితీస్తుంది.
మన దేశంలో వైరస్ వ్యాప్తి తక్కువ ఉన్నందున లేదా దైనందిన జీవితంలో తక్కువ స్థాయి కలిగిన వైరస్‌ను ఎదుర్కుంటున్న భారతీయులుగా మన శరీరంలో కొంత సహజసిద్దమైన రక్షణ (రోగనిరోధక శక్తి)ను కగివుండడం వలన అదృష్టవశాత్తూ ఇలాంటి ప్రమాదకరమైన సమస్యలు మనదేశంలో చాలా తక్కువగా చూడవచ్చు. కోవిడ్ సోకిన మొత్తం రోగులలో 5% కంటే తక్కువగానే ఈ గుండె సంబంధిత వ్యాధులను చూడవచ్చు. వృద్దులలో మరియు అంతకు ముందునుండే అధిక రక్తపోటు లేదా మధుమేహం లేదా వృద్దులైన గుండెపోటు రోగులలో దీనిని అధికంగా చూడవచ్చు.
శరీరంలోని అన్ని భాగాలపై వైరస్ క్రమంగా దాడి చేయడంతో పాటు శరీరంలో సెకండరీ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు మరియు సెప్సిస్ అభివృద్ది చెందడం ద్వారా సమస్యులు ఉత్పన్నమౌతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులో గుండె, రక్తపోటు లేదా మదుమేహం లేదా కొలెస్ట్రాలు మందులను వాడటం మానరాదు, ఆ విధంగా మనం ఇన్‌ఫెక్షన్ బారినపడకుండా కాపాడుకోవచ్చు లేదా కనీసం కోవిడ్ ఇన్‌ఫెక్షన్ వచ్చినా పైన పేర్కొన్న విధంగా మరింత ప్రమాదకరమైన సమస్యలకు లోనుకాకుండా నిరోధించవచ్చు.
చికిత్స కంటే నివారణే ఉత్తమం – అనే సామెతను అనుసరించి, వైరస్ మంచిందే ఎందుకంటే పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారపు అవాట్లను అనుసరించడం, యోగా మరియు ధ్యానం వంటివి పాఠించడం లేదా కొంత నడక సాధన చేయడం, తేలికపాటి వ్యాయామాు చేయడం, అధిక ఒత్తిడిని నివారించడం వంటి ఆరోగ్యకరమైన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాధి బారిన పడకుండా నివారించుకోగుగుతున్నాము. ప్రాణాంతకమైన కోవిడ్ మహమ్మారిని నివారించడంలో మరియు నియంత్రించడంలో వీటిని సుదీర్గకాలం కొనసాగించాలి. సురక్షితం, ఆరోగ్యంగా ఉండండి.
డా॥ ఎ. శ్రీనివాస్ కుమార్, డైరక్టర్ కార్డియాజీ & క్లినికల్ రీసెర్చ్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్.