తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కరోనాపై విజయం సాధించారు. 80 ఏళ్ల పురోహిత్ రెండువారాల క్రితం వైరస్ భారినపడ్డారు. రాజ్‌భవన్‌లో దాదాపు 83 మంది సిబ్బంది కూడా కొవిడ్ లక్షణాలో చికిత్స పొందారు. వైద్యుల పర్యవేక్షణ.. పురోహిత్ మనోధైర్యమే వైరస్‌ను తేలికగా ఎదిరించేందుకు కారణమైంది. దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వైరస్ భారీన పడుతూనే ఉన్నారు. అమితాబ్, అమిత్‌షా తదితరులు ఇటీవలే కోలుకున్నారు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 5న బాలు స్వయంగా తాను వైరస్‌కు గురైనట్టు ప్రకటించారు. ఆ తరువాత ఆరోగ్యం క్షీణించటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ట్వీట్ సందేశం చేశారు.
శతమానం భవతి