భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. భారత్‌బయోటెక్_ఐసీఎంఆర్ సారథ్యంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు ఏ నాడో శ్రీకారం చుట్టారు. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత్ బయోటెక్ దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సిద్దమైంది. వాటిలో హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ఒకటి. ఇక్కడ ఈ నెల 7 నుంచే క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంది. కొన్ని సాంకేతికమైన ఇబ్బందులతో కొద్దిరోజులు ఆలస్యమైనా.. మూడ్రోజుల క్రితమే 6 గురు వ్యక్తుల నుంచి రక్తనమూనాలు సేకించి ఢిల్లీ పంపారు. అక్కడ వారి ఆరోగ్యపరిస్థితిపై నివేదిక వచ్చింది. వెంటనే ఆరుగురుపై కొవాగ్జిన్ మొదటి డోస్ ప్రయోగించినట్టు సమాచారం. ప్రస్తుతం వారందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ఆరుగురుని ఇంటికి పంపాక.. 14 రోజులు పూర్తి అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. ఆ తరువాత మరోడోస్ ఇస్తారు. అలా.. మూడు దఫాలుగా డోస్‌లు ఇచ్చాక.. ఫైనల్ రిజల్ట్ ప్రకటిస్తారు. అనధికార సమాచారం ప్రకారం.. దాదాపు కొవాగ్జిన్ వ్యాక్సిన్ వినియోగించేందుకు అనువుగానే ఉందట. కానీ.. శాస్త్రీయ రుజువుల కోసమే ఈ తతంగం అంతా అంటున్నారు. ఏమైనా.. అగస్టు 15 రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. వ్యాక్సిన్ గురించి కీలక ప్రకటన చేస్తారు. ఇది నిజంగానే.. భారతదేశ కీర్తిని పెంచటమే కాదు… మానవాళికి మరోసారి భారతీయులు ఊపిరి పోసినవాళ్లవుతారు.