ప్రతి ఒక్కరు పుట్టిన రోజు సందర్బంగా జీవితానికి ఉపయోగపడే ఏదో నిర్ణయం తీసుకోవటం లేదా మనసుకు సంతోషాన్నిచ్చే ఒక పని చేయటం సాధారణం… కానీ బోధ్ గయకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా చంద్రుని పై ఒక ఎకరా స్థలాన్ని కొన్నాడు. అతగాడి పేరు నీరజ్ కుమార్, ఇతను ఒక వ్యాపారవేత్త. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, ఇటీవల మరణించిన సుశాంత్ సింగ్ కూడా చందమామ పై స్థలాల్ని కొన్నారు. భూమి మీద స్థలం కన్నా తక్కువ ఖరీదు అయినప్పటికీ కొనుగోలు ప్రక్రియ క్లిష్టమని నీరజ్ కుమార్ చెప్పుకొచ్చారు