పంచాయ‌తీ రాజ్‌లో అవినీతి చంద్రుడు!

మూడేళ్ల‌కే ఒక‌టోత‌ర‌గ‌తి చ‌దివాడు. ప‌దేళ్ల‌కే.. టైపింగ్ పాస‌య్యాడు.. ద‌ర్జాగా స‌ర్కారు కొలువు కొట్టేశాడు. పోన్లే టైప్ చేయ‌టం వ‌చ్చా అంటే.. అబ్బే.. టైప్ మిష‌న్ ముందు పెడితే.. అష్టాచ‌మ్మా ఆడ‌దామా అనే బాప‌తు. ఇంత‌టి గొప్ప ప‌రిజ్ఞానం ఉన్న స‌ద‌రు పెద్దాయ‌న‌.. ఎక్క‌డ అనేగా మీ సందేహం. మ‌న ఏపీలోని కృష్ణాజిల్లాలోనే ప్ర‌భుత్వ కొలువులో చిన్న ఉద్యోగిగా అదీ న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌తో కొలువు ప‌ట్టేసిన స‌ద‌రు అక్ర‌మాల చంద్రుడు.. ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని వ‌ణికించేంత వ‌ర‌కూ చేర‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ ఏదైనా.. సీఎం ఎవ‌రైనా నాదే దందా.. నేను చెప్పిందే శాస‌నం అనేంత‌గా పేట్రేగిపోతున్నాడు. ఈయ‌న‌కు కిందిస్థాయి ఉద్యోగులంటే గిట్ట‌దు. పోన్లే.. పైవాళ్ల‌ను గౌర‌విస్తాడా!అంటే అబ్బే అదీ లేదు.. త‌న ఇలాఖాలోకి ఎవ‌రు కాలుపెట్టినా… అంద‌ర్నీ ఇట్లే ఆక‌ట్టుకుంటాడు. ఎవ‌రికి ఏం కావాల‌న్నా.. క్ష‌ణాల్లో ఎరేంజ్‌చేసి ప‌క్క‌… న ప‌డేస్తాడు. అందుకే.. ఈయ‌న మీద ఫిర్యాదులు ఎన్ని వ‌చ్చినా అధికారులు స్పందించ‌ట్లేదట‌. పాపం ఏ నాటికైనా పండుతందంటే.. ఇదే అనుకోవాలి. ఎందుకంటే.. ఇత‌గాడి నీచ‌బాగోతం రాష్ట్ర ఎల్ల‌లు దాటి.. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం వ‌ర‌కూ చేరింది. మూడు ద‌శాబ్దాలుగా ప‌ల్లె నుంచి ప‌ట్ట‌ణం వ‌రకూ అన్నింటా ప‌నిచేసిన ఇత‌గాడి అవినీతి చిట్టా ఒక్కోక‌టి రుజువుల‌తో స‌హా చూపుతూ పీఎంఓ కార్యాల‌యానికి బాధితులు ఫిర్యాదు చేశారు. అంతే… చాప‌కింద‌కు నీరు వ‌చ్చిన‌ట్టు తెలియ‌గానే స‌ద‌రు చంద్రుడు అ ప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. ఎలాగైనా బ‌య‌ట‌ప‌డేందుకు త‌న కింద ప‌నిచేసే ఉద్యోగుల‌ను బ‌లిప‌శువులుగా మార్చే ప్ర‌య‌త్నం చేశాడు.. ఇంత‌గా చెల‌రేగుతున్న కేటుగాడి మాయా బాగోతం.. ఎలా ఉంటుంద‌నే వివ‌రాలు… తెలియాలంటే.. రెండ్రోజులు ఆగాల్సిందే!

Episodes Coming Soon..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here