పవన్ కళ్యాణ్ పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా వెండితెరపై మెరిసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుసగా ఏడు సినిమాలు సరిగా ఆడకపోయినా ప్లాప్ హీరో అంటూ కొందరు విష ప్రచారం చేసినా అభిమానులు మాత్రం తగ్గలేదు. ప్రేక్షకులు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. 2014లో రాజకీయపార్టీతో వస్తే.. అబ్బే ఇదొక ప్రజారాజ్యం అంటూ ఎగసెకం చేసినవారూ ఉన్నారు. అటువంటి వర్గమే.. సాయం కోసం వస్తే.. ఆంధ్రప్రదేశ్ కోసం సాయం చేశాడు. ముఖ్యమంత్రిని చేశారు. 2019లో పవన్‌పై విషప్రచారం చేసినా 18శాతం ఓట్లు పడ్డాయి. బీమవరం, గాజువాకలో ఓడిపోతే.. పవన్ పని అయిపోయిందన్నారు. ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు.. అయినా జనంలోనే ఉంటామంటూ సేనాని నిలబడ్డారు. నాయకుడికి తగినట్టుగానే జనసైనికులు కూడా అదే ఉత్సాహం చూపారు. మేం ఓడాం అంతేనంటూ రెట్టించిన ఉత్సాహంతో కరోనా సమయంలో ప్రజాసేవకై కదిలారు. కూలీ చేసుకునే పవన్ అభిమాని కూడా తన సంపాదనలో కొంత సాటివారం కోసం ఇచ్చి పవన్‌కు తామే నిజమైన అభిమానులమంటూ చాటుకున్నారు. 2021 పంచాయితీ ఎన్నికల్లో జనసేన తరపున నామినేషన్ వేసేవాళ్లు ఉన్నారా! అంటూ వ్యగ్యంగా మాట్లాడారు. అదే జనసేన పంచాయతీ ఎన్నికల్లో 250 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. జనంలో పవన్ పట్ల అభిమానం చెక్కుచెదరలేదని నిరూపించారు. పైగా 30శాతం ఓట్లు పెరగటం.. భవిష్యత్ జనసేనదే అనేందుకు నిలువుటద్దం. ఇప్పుడు ఇదే ప్రత్యర్థి పార్టీలకు ఊహించని షాక్. కానీ.. పవన్ మాత్రం.. మేం గెలిచినా.. ఓడినా జనం వైపు ఉంటామంటున్నారు. ఆ ఒక్క ఆత్మవిశ్వాసం రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ జనసేనకు ఓట్లు కురిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసుకుంటున్నారు.



