ఏడుకొండలపై వెలసిన కలియుగ దైవం. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం. నమో వెంకటేశా అంటే పరుగున వచ్చి ఆపద నుంచి గట్టెక్కించే ఆపదమొక్కులవాడు. ప్రపంచవ్యాప్తంగా తిరుమలగిరులు అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు ఉంది. హైందవ పరిరక్షణకు కంకణబద్దులైన ఎందరికో అదొక మార్గం. అటువంటి పరమ పవిత్రమైన తిరుమలేశుడి నీడలో కొందరు
హైందవానికి తూట్టు పొడుస్తున్నారు. తాజాగా గుంటూరుకు చెందిన ఓ భక్తునికి ప్రతినెలా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సప్తగిరి పత్రిక ద్వారా మాసపత్రికలు వస్తుంటాయి. భక్తుల విరాళాలతో నడిచే ఆ పత్రికను తెప్పించుకున్న ఆ భక్తుడు తనకు వచ్చిన పార్శిల్ చూడగానే ఖంగుతిన్నాడు. తన కళ్లెదుట తిరుమలేశుడి పుస్తకంతోపాటుగా.. అన్యమతానికి సంబంధించిన మరో పుస్తకం కనిపించగానే నిస్సహాయంగా ఉండిపోయాడు. టీటీడీ ఉన్నతాధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. తన మనోభావాలు దెబ్బతినటం వల్ల బాదపడుతున్నట్టు బాధితుడు తెలిపారు. మరోసారి ఇటువంటి తప్పిదాలు చోటచేసుకోకుండా చూడాలని కోరుతున్నాడు. దీనిపై టీటీడీ ప్రజాసంబంధాల విభాగం వివరణ ఇచ్చింది. పోస్టల్ శాఖ ద్వారా సప్తగిరి పత్రికను పాఠకులకు పంపుతున్నట్టు వివరించారు. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు చేసిన కుట్రగా పేర్కొన్నారు. జిల్లాల వారీగా పలువురు పాఠకులకు ఫోన్‌చేసి అడిగినా ఎవరికీ ఇటువంటి పుస్తకాలు రాలేదని చెప్పారని వివరించారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. గతంలోనూ సప్తగిరిలో వచ్చిన కొన్ని అన్యమత ప్రచురణలు, కొన్నిపౌరాణిక పాత్రలను కించపరుస్తూ వచ్చిన కథలు భక్తులను ఇబ్బందికి గురిచేశాయి. వరుస ఘటనలో అప్రమత్తమైన టీటీడీ ఇటువంటి తప్పిదాలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతుందనేది అర్ధమవుతుంది.
హిందుత్వం.. అంటే కేవలం మతంగానే చూస్తున్నారు. కానీ అదొక సనాతన ధర్మమార్గం. ఆచార సంప్రదాయాలను ఆచరిస్తూ మనిషిగా ఉత్తమంగా ఎదగాలనేది సంకల్పం. రామాయణ, మహాభారత ఇతిహాసాలు కూడా వ్యక్తి నుంచి వ్యవస్త వరకూ.. సమాజం నుంచి రాజ్యం వరకూ ఎలా పాలించాలి.. పాలకులు.. పాలితుల ధర్మాలను మాత్రమే ప్రబోధించారు. ఎలాగోలా బతికేయటం కాదు.. ఇలాగే బతకాలంటూ ఒక నిబంధన సూచించారు. రాజకీయాలు.. పార్టీలు.. నాయకులకు మాత్రం ఎన్నికలపుడు మాత్రమే ఇవన్నీ గుర్తొస్తాయి. మంది ఎక్కువగా ఉన్నా ఐకమత్యలోపం హిందువుల పాలిట శాపంగా మారుతుంది. ఎన్నికల ముందు కాషాయం కప్పుకుని.. తలపాగా చుట్టుకుని.. హిందుధర్మ పరిరక్షణకు తాము బద్దులమంటూ వాగ్ధానాలు చేసిన నాయకగణం.. ఆ తరువాత క్రమంగా వాటిని విస్మరిస్తూ వస్తుంది. కానీ.. నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక.. గుండెల నిండుగ.. తమ సనాతన ధర్మాన్ని ధైర్యంగా ఆచరించేందుకు హిందువులు చొరవ చూపుతున్నారు. కానీ తెలుగునేలపై
తరచూ ఎదురవుతున్న పరాభవాలు.. హిందుత్వానికి ఎదురవుతున్న సవాళ్లు మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటున్నాయి హిందు సంఘాలు.