ఈ పోలిక కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. తరచి చూస్తే.. నిజమే కదా! అనిపించక మానదు. విభజించు .. పాలించు తెల్లదొరలు భారతీయులపై ప్రయోగించిన తొలి అస్త్రం. అదే ఐకమత్యాన్ని దూరం చేసి.. తేలికంగా తెల్లోడి పరమయ్యేందుకు కారణమైంది. ఆ తరువాత.. గాంధీ, భగత్‌సింగ్, అజాద్, సర్దార్‌వల్లబాయ్‌పటేల్, శాస్త్రి వంటి మహనీయులు ఇండియన్స్ మధ్య ఐకమత్యాన్ని పెంచి.. మళ్లీ స్వరాజ్యం సంపాదించేందుకు దాదాపు రెండు శతాబ్దాలు పట్టింది. 1526 బాబర్ దండయాత్రతో మొదలైన బానిసత్వం.. 1947 అగస్టు 15తోనే కానీ అంతం కాలేదన్నమాట. హమ్మయ్య స్వతంత్రం తెచ్చుకున్నాం.. కుల, మతాలు, ప్రాంతాలను మరచి ఏకత్వంగా ఉందామనే నాటి సమరయోధుల కల.. కలగానే మిగిలింది. ఆ తరువాత రాజకీయాలు.. మళ్లీ తెల్లోడి బాటలోనే విభజిస్తున్నాయి.. కుల, మత, ప్రాంతాలను కలవకుండా విభజించి అధికారం చేజక్కించుకుంటున్నాయి. అటువంటి దారిలోనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు నడుస్తున్నాయి. తెలుగోడు వచ్చినా తెల్లోడి ఫార్ములానే అనుసరిస్తాయనే భావన ప్రజల్లో కలిగిస్తున్నాయి. అదెలా అంటారా.. ఒకసారి చదవండీ!
స్వాంతంత్ర వచ్చాక.. అచేతు హిమాచలం ఒక్కటే అనే భావన ప్రజల్లో కలిగించాల్సిన రాజకీయపక్షాలు పక్కదారి పట్టాయి. లక్ష్యాలు మరచి కేవలం రాజకీయ అధికారమే పరమావధిగా వ్వవహరించాయి. ఉత్తరాధి, దక్షిణాధి అంటూ వేరు చేశాయి. భాషలపేరిట కుమ్ములాటలు తప్పలేదు. పంజాబ్, అసోం వంటి చోట ప్రత్యేక పాలిక ప్రాంతం కావాలంటూ ఘర్షణలకూ ఇదే కారణం. ఏపీను రెండు ముక్కలుగా చీల్చటానికి .. ప్రాంతాల వారీగా అసమానతలను దూరం చేయాల్సిన పెద్దలు. వాటినే తమ అధికారానికి నిచ్చెనలుగా వాడుకున్నారు. ఉత్తరాంధ్ర, తెలంగాణ, కోస్తా, నైజాం, రాయలసీమ ఇలా ఎందుకీ పేర్లు.. అందరం ఆంధ్రులమే. కాదంటే తెలుగోళ్లమనే భావనను ప్రజలకు దగ్గర చేయటంలో విఫలమయ్యారు.
ఫలితంగా తెలంగాణ ఉద్యమానికి పరోక్షంగా కారకులయ్యారు. రాష్ట్రం విడిపోయాక కూడా.. మళ్లీ ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ అంటూ అభివృద్ధి పేరిట.. ప్రజల మధ్య దూరాన్ని పెంచుతున్నారు. ఎమోషనల్‌గా కూడా విడదీస్తున్నారనే ఆవేదన కూడా ప్రజల్లో కలుగుతోంది. తెలంగాణలోనూ ఇదేతంతు.. ఉత్తరతెలంగాణ, దక్షిణ, తూర్పు , పశ్చిమం.. ఎందుకీ వివక్ష అనేది జనం అడగలేరు. మేధావుల గళమెత్తితే చూశారా.. ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారని కేసులు మోపుతారనే భయం. వెరసి.. స్వాతంత్ర దినోత్సవ స్పూర్తితో భాషలు.. ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ ఒక్కటే అనే భావనను మరింత బలాన్నిచ్చినపుడే మహనీయుల ప్రాణత్యాగాలకు అసలైన అర్ధం.. భారతీయతకు పరమార్ధం.
సూపర్ గా ఉంది ఆర్టికల్