ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎవరు? తమిళనాడు నుంచి వచ్చిన మాజీ న్యాయమూర్తి వి. కనగరాజా! లేకపోతే.. నిమ్మగడ్డ రమేష్‌కుమారా! బాబోయ్ ఇంత పెద్ద ప్రశ్నకు సమాధానం కష్టమే అనిపిస్తుంది కదూ! నిజమే. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికల అధికారిగా నాటి సీఎం చంద్రబాబు నియమించాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. సహజంగానే జగన్ సీఎం అయ్యాక.. టీడీపీ అనుకూలమైన అధికారులకు కుదిరితే ఊస్టింగ్స్ లేకపోతే… ఏదో ఒక పోస్టుకు సాగనంపారు. నాటి డీజీపీ ఏబీ వెంకటేశ్వరావు కూడా అలాగే వెళ్లిపోయారు. ఆ తరువాత నిమ్మగడ్డ వంతు. అది కూడా అంతఈజీగా కుదర్లేదు. ఎన్నికల అధికారిగా ఆయన తీసుకున్న నిర్ణయం.. సర్కారుకు తప్పుగా కనిపించింది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయ దుంధుబి సాధించలని మాంచి ప్లాన్ రెడీ చేసుకుంది. పనిలో పనిగా.. బెదిరింపులు.. కేసులతో్ టీడీపీ నేతలు, కార్యకర్తలకు వైసీపీ కండువా కప్పేసింది. ఇంకేముంది ఏప్రిల్‌లో ఎన్నికలు జరపాలనుకున్నారు. కానీ.. నిమ్మగడ్డ మాత్రం.అసలే కరోనా విజృంభిస్తుంది. సారీ.. అంటూ ఏ పార్టీతో చివరకు ప్రభుత్వంతో కూడా చర్చించకుండా ఎన్నికల రద్దు చేశారు. అంతే.. సీఎం జగన్ మోహన్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దిక్కారమున్ చేతువా! పైగా.. చంద్రబాబు తొత్తుగా ఆయన మాటే వింటావా! అంటూ రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డను మాజీ చేశారు. తమిళనాడులో దళిత మాజీ న్యాయమూర్తి కనగరాజ్‌ను ఆగమేఘాల మీద ఏపీకు రప్పించి ఎన్నికల అధికారిగా నియమించారు. అదేమిటీ.. ఆ మాత్రం సమర్థత ఉన్న వాళ్లు ఏపీలో లేరా! అని మాత్రం అడగొద్దు. దీంతో నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించాడు. రాజ్యాంగబద్దమైన పదవిని ప్రభుత్వానికి తొలగించే అధికారం లేదన్నాడు. దీంతో సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. చివరకు సుప్రీం హైకోర్టులో తేల్చుకోమన్నట్టుంది. హైకోర్టు తన ఆదేశాలను బేఖాతరు చేయవద్దని.. వెంటనే నిమ్మగడ్డకు పోస్టింగ్ ఇవ్వాలని గవర్నర్‌ను ఆదేశించింది. గవర్నర్ కూడా న్యాయస్థానం నిర్ణయంతో నిమ్మగడ్డకు ఎన్నికల అధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ కార్యదర్శికి ఉత్తర్వులు జారీచేశారు. కానీ..
వైసీపీ సర్కారు మాత్రం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. హైకోర్టు ఎలా తీర్పునిస్తుందంటూ మళ్లీ సుప్రీంను ఆశ్రయించింది. ఇలా నాలుగు స్తంభాలాటగా మారిన పరిస్థితుల్లో నిమ్మగడ్డను కొనసాగిస్తారా.. భంగపాటుతో పక్కకు తప్పిస్తారా!
అనేది చర్చనీయాంశంగా మారింది.