పెళ్లంటే… అటు ఏడు తరాలు.. ఇటు ఏడుతరాలు చూడాల. ఇరువైపుల కుటుంబాలకు నచ్చాల. ఏ మాత్రం మాట పట్టింపు వచ్చినా.. నూతన వస్త్ర కొనుగోలు దగ్గర తేడాలొచ్చినా అంతే సంగతులు. అంతా అమ్మనాన్నల ఇష్టాఇష్టాల మీదనే ఆధారపడి ఉండేది. మరి ఇపుడు కాలం మారింది. దాంతోపాటు అబ్బాయిలు/అమ‌్మాయిల అభిరుచులు మారుతున్నాయి. పెళ్లిపట్ల స్పష్టంగా ఉంటున్నారు. ఉన్నత చదువులు.. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల ఆశలు, ఆలోచనలకు తగినట్టుగానే కన్నవారు సరే అంటున్నారు. భారత్‌మ్యాట్రిమోనీ సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఏపీ, తెలంగాణల్లో పెళ్లీడు కొచ్చిన యువతీ, యువకులు ఏమనుకుంటున్నారు. జీవితభాగస్వామి ఎంపికలో ఏం కోరుకుంటున్నారనే అంశాలను దాదాపు 6 లక్షల మంది ప్రొఫెల్స్ నుంచి సేకరించారు. ఇక్కడ విశేషమేమిటంటే.. 60శాతం మంది యువతీ, యువకులు తమకు నచ్చిన లైఫ్‌పార్టనర్ తామే ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారు. హైదరాబాద్, ఉభయగోదావరిజిల్లాలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రదాన నగరాల్లో 81శాతం రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే.. వీరిలో 9 శాతం ఇతర ప్రాంతాల్లోని వారుంటున్నారు. అమ్మాయిల్లో అధికశాతం తాము చేసుకోబోయే అబ్బాయి వయసు 23-27 మధ్య ఉండాలనుకుంటున్నారు. మరి అబ్బాయిలు అంటారా.. వారు కూడా 23-30 వయసు లోపు చాలంటున్నారట. 8 శాతం అమ్మాయిలు, 10 శాతం అబ్బాయిల తమకు కుల పట్టింపుల్లేవంటున్నారట. 67శాతం యువతులు, 64శాతం మంది యువకులు. పొరుగు రాష్ట్ర వారైనా పర్లేదంటున్నారట.