
మాటలు చెప్పటం కాదు.. చేతల్లోనూ మెగాస్టార్ ప్రత్యేకత వేరు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సెల్ ఏర్పాటు చేసిన ప్లాస్మాదానం-ప్రాణదానం కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆలిండియా మెగాఫ్యాన్స్ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ప్లాస్మా దానం చేయటం ద్వారా ఒక యువకుడుని కాపాడటంపై ప్రశంసలు కురిపించారు. దాతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఏం మాట్లాడారనేది.. ఆయన మాటల్లోనే!
ఇది చాలా ప్రత్యేకమైనది.. చాలా బాధ్యతతో కూడుకున్నది. దీనిపై మాట్లాడిల్సిన పరిస్థితి. కరోనా క్రైసిస్‌లో ఇలాంటి కార్య్రమాలు ఏర్పాటు అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ఎస్సీ ఎస్సీ సొసైటీ ఫర్ సైబరాబాద్ కౌన్సెల్ ముందు ఉండి. తాము అనుకున్నది సాధించేవరకూ సాధించే వరకూ ఫ్రంట్‌లైన్ హీరోస్ . సజ్జనార్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. మన కరతాళ ధ్వనులతో వారిని అభినందించాలి. వారికి నాకూ.. పరిచయం చాలా తక్కువ. కానీ ఆయన గురించి నాకు చాలా తెలుసు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా.. ఆర్టిస్టు చక్కగా పాడాడు అని తెలిసినా సామాజిక సృహతో బయటకు తెలియజెప్పాలనే ఆలోచన చాలా గొప్పది. ట్వీట్టర్ ద్వారా ఆయన ఇచ్చిన ఆదేశాలను చేస్తూ ఉంటాను. వారు నన్ను.. ఈ మంచి మార్గంలో నన్ను నడిపిస్తున్నందకు ధన్యవాదాలు చెబుతున్నా. నిన్న ఫోన్‌చేసి ప్లాస్మా దానం గురించి చెప్పినపుడు.. మీరు చెబితే చాలా మంది వింటారు.. ఆచరిస్తారని చెప్పినపుడు.. ఎటువంటి ఆలోచన తీసుకోకుండా వస్తానని ధైర్యంగా చెప్పాను. తప్పకుండా బయటకు వస్తానని చెప్పాను. ఇటువంటి అవకాశం రావటం ఇది నాకు చాలా గౌరవంగా భావిస్తున్నా. ఇటువంటి చక్కటి కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి డీసీపీ శంషాబాద్ ప్రకాశ్‌రెడ్డి, పద్మజారెడ్డి, విజయకుమార్‌రెడ్డి అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా.తమ డ్యూటీకు అదనంగా కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇంత గొప్ప సర్వీసు చేస్తున్న పోలీసు, వైద్య, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి ధన్యవాదాలు చెబుతున్నా. ఇలాంటి క్రైసిస్ వస్తుంటాయి..
22 సంవత్సరాల క్రితం.. నా గురించి నేనే ఆలోచిస్తున్న సమయంలో పేపర్ చూశాను. ఒక రోజు పేపర్ చూసి రక్తం అందక ఎంతోమంది చనిపోతున్నారని చదివాను. గర్భిణులు, తలసీమియా బాధితులు, యాక్సిడెంట్స్ వల్ల రక్తందొరక్క ఎంతో మంది మరణిస్తున్నారనే బాధేసింది. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సినిమా వస్తే ఈలలు. గోలలు చేస్తారు. ఇంత ఫ్యాన్స్‌కు రక్తదానం గురించి సందేశం పంపగలిగితే సొసైటీకు మేలు జరుగుతుందనుకున్నా. ఆ రోజున చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ప్రారంభించాను. ఇప్పటికీ 2020 డిసెంబరు 1న ది బెస్ట్ బ్లడ్‌బ్యాంక్ అవార్డును కేంద్రం ప్రకటించింది. అదే రోజున అవార్డు తీసుకోబోతున్నా. కరోనా భారీన పడుతున్నారు. ఎక్కడా మందులేదు. వస్తే మనకున్న రోగనిరోధకశక్తితో బయటపడాల్సిందే. మరి అసక్తులు ఏం చేయాలి. ఏమిటీ దారి అనుకున్నపుడు . ఆ భగవంతుడు మనల్ని మనమే కాపాడుకోగలమనే ప్లాస్మా అనే సంజీవని అందించాడు. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మా.. ప్రాణాపాయంలో ఉన్న కొవిడ్ రోగులకు సంజీవని. మనం దగ్గర ఉన్న బ్లడ్‌లో ఉన్న ప్లాస్మా ఇవ్వగలిగితే 99..99 శాతం..
స్వామినాయుడు స్పూర్తిని కొనసాగిద్దాం!
పవన్ కుమార్ అనే వ్యక్తి అపోలోలో చేరాడు. ఇంట్లో క్వారంటైన్లో ఉన్నా ఆక్సిజన్ 84కు వచ్చేసరికే అపోలోకు చేర్చాం. డాక్టర్స్
సర్ క్రిటికల్ గా ఉందని వైద్యులు చెప్పారు. ప్లాస్మా ఎక్కిద్దామని చెప్పారు. రాత్రికి రాత్రి చెబితే. బ్లడ్‌బ్యాంక్‌లో ఉండే సీఈవో, అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ సంఘ అధ్యక్షుడు స్వామినాయుడు కూడా కరోనా నుంచి బయటపడి రెండు వారాలైంది. నువ్వెళ్లి ఇవ్వమని చెప్పగానే అతడు ఇచ్చాడు.. అతడు పాస్ట్‌గా కోలుకుంటున్నాడు. ఆ ఇచ్చిన స్వామినాయుడు ఇక్కడే ఉన్నాడని చిరంజీవి ప్రశంసలు కురిపించారు. మనలో ఉండే యాంటీబాడీస్ మూడు నెలల పాటు ఉంటాయి.. ఈ 3 నెలలు డొనేట్ చేయగలిగితే ఎంతోమంది రోగులను బతికి బట్టకట్టేలాగా చేయగలమంటూ చిరంజీవి సూచించారు. ప్లాస్మాదానం చేశాక కేవలం 3 రోజుల్లో సర్దుకుంటాయి. ప్రతి మూడు వారాలకు ఒకసారి ఇవ్వగలిగితే ఒక్క వ్యక్తి 30 మందికి ప్రాణదానం చేయవచ్చు. ప్రతివారం వెళ్లండీ.. కాస్త బలహీనం అవుతారేమో కానీ. ఏమీ కాదంటూ ప్లాస్మా దాతలకు చిరంజీవి పిలుపునిచ్చారు.