ఐదేళ్ల అధికారంలో ఉండి.. అన్నీ తామై నడిపించిన నేతలు కనిపించుటలేదు. నిజమండీ.. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడ చూసినా వారే.. ప్రతి మీడియా సమావేశంలోనూ వాళ్లే కనిపించేవారు. 2019లో వైసీపీ ప్రభంజనంతో అందరూ మాజీలయ్యారు. ముఖం చాటేసి.. ఏ జెండా వైపు మొగ్గుచూపాలా! అనే మీమాంశలో ఉన్నారట. ఇంతకీ.. ఆ నేతలు ఎవరనేగా.. ప్రత్తిపాటి పుల్లారావు.. గుంటూరు జిల్లాకు చెందిన ఈయన వ్యవసాయశాఖ మాత్యులుగా పనిచేశారు. అన్నపూర్ణవంటి ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దరించింది ఏమీలేదు కానీ.. అమరావతి రాజధాని పేరుతో బాగానే సంపాదించారనే ఆరోపణలు మాత్రం మూటగట్టుకున్నారు. భార్యపేరిట అగ్రిగోల్డ్ ఆస్తులతో భాగానే లాభపడ్డారనే గుసగుసలూ లేకపోలేదు. రెండో మంత్రి పితాని సత్యనారాయణ.. కార్మికశాఖ మంత్రిగా అచ్చెన్న అంతగా గాకపోయినా పర్వాలేదంటారు జనాలు. లేకపోతే.. మందుల స్కామ్‌లో అచ్చెన్న అరెస్టు కాగానే.. పితాని అనుచరులు ఉలికిపాటుకు కారణం ఏమై ఉంటుందంటారు. బాబోయ్ మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్ కోసం వెంపర్లాడుతున్నారు. మరో మంత్రి వర్యులు.. సారీ మాజీ మంత్రి నారాయణ. కాపు కోటాలో అనుకోకుండా మంత్రయ్యారు. ఏ నాడూ కాపు అని చెప్పుకోలేని ఆయనకు కలిసొచ్చిన కులం అలా పదవిని తెచ్చిపెట్టంది. సీఆర్‌డీఏ అంటూ.. అమరావతి భూ భాగోతంలో బాగానే ముట్టాయట. మంత్రిగా ఐదేళ్లపాటు.. బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు బడుల్లో ఫీజులు వసూలు చేసుకునే పనిలో పడ్డారట. మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు.. అన్నీ తానై చక్రం తిప్పిన ఈయన తొలిసారి మైలవరం లో ఓటమి చవిచూశారు. పోలవరం అంతా తానే కడుతున్నంతగా ఫీలయ్యేవారు. దేవినేని వారి పోలవరం అనేంతగా బిల్డప్ ఇవ్వటం.. పైగా అదేదో.. తాజ్‌మహల్ అనేంతగా జనాల్ని ఆర్టీసీ బస్సుల్లో తరలించి మరీ దర్శనం చేయించారు. ఆ ముచ్చటకైన ఖర్చు కూడా ఆర్టీసీకు ప్రభుత్వ ఇవ్వలేదట. ఇలా.. బుద్దా వెంకన్న, చినబాబు లోకేష్, బోండా ఉమా, మెయిన్‌గా మరో పేరు.. గంటా శ్రీనివాస్.. ఆ నాడు ప్రజారాజ్యం పార్టీ మునగటంలో కీలకమైన వ్యక్తి అంటూ విమర్శలూ చిరు అభిమానుల నుంచి ఎదుర్కోన్నాడు. పరిటాల సునీత.. ఫాఫం వారసుడు శ్రీరామ్‌ను రాజకీయంగా జీవితం ఇద్దామనే ఆశను వైసీపీ హవా దెబ్బతీసింది. ఇలా.. చాంతాడంత జాబితాలో ఉన్న టీడీపీ నేతలు.. ఇప్పుడు గత తప్పిదాల తాలూకూ.. ముప్పు ఏ వైపు నుంచి దాడిచేస్తుందో తెలియక దిక్కులు చూస్తున్నారట. వైఎస్ జగన మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక.. అవినీతి జాబితా బయటకు తీసి ఒక్కొకరి తాటతీసే పనిలో పడటంతో తమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.