టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండన్న అనారోగ్యంతో కనుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. కాగా పరిస్థితి విషమించి శనివారం మరణించారు. పరిటాల రవీంద్ర దారుణ హత్య తరువాత కుటుంబానికి పెద్దదిక్కుగా కొండన్న అన్నీతానై నడిపించారు. కూతురుకు అండగా ఉంటూ వచ్చారు. కొండన్న మరణానికి టీడీజీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌బాబు సంతాపం తెలియజేశారు. కొండన్న అనంతపురంలోని సనసకోట ముత్యాలమ్మవారి దేవాలయ ఛైర్మన్‌గా దీర్ఘకాలం పనిచేశారు.



