బైరటీస్… కేజీఎఫ్‌ను గుర్తుతెచ్చే గని. కడప జిల్లా మంగంపేట లోని గనులకు ఒక ప్రత్యేకత ఉంది. ఏపీ ఖజానాకు వేలకోట్ల రూపాయలు ఇస్తున్న సంస్థ . వేలాది మంది ఉద్యోగులున్నా అక్కడ ఏం జరుగుతుంది.. ఎవరు నియంత్రణలో ఉంటారు. అనేది ఇప్పటికీ సస్పెన్స్. అటువంటి చోట ఎన్నో దారుణాలు నిత్యం కళ్లెదుట జరుగుతూనే ఉంటాయి. కానీ.. వాటిలో కొన్ని వెలుగుచూస్తే మరికొన్ని చీకట్లో కలసిపోతుంటాయి. ఒక్కసారి ఎవరైనా లోపలకు అడుగు పెడితే బయట సమాజం తో వున్నా అన్ని సంబంధాలన్నీ తెంపుకోవాల్సిందే అనే అంతగా ఆరోపణలున్నాయి. ఇవన్నీ బయటకు రాకుండా అక్కడ అడుగడునా నమ్మినబంట్లు కాపుకాస్తుంటారు. అటువంటి చోట దారుణం జరిగింది. బైరటీస్ గనుల్లో వంద అడుగుల పై నుంచి లారీ కిందపడిపోయిందట. అసలు అక్కడ ఏమీ జరగన్నట్టుగానే అందరూ మౌనంగా ఉండిపోయారట. విషయం తెలిసి కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను కూడా పరుగులు పెట్టించారట. ఎవరైనో నోరెత్తితే ఇంతే సంగతులంటూ కొందరు ప్రయివేటు వ్యక్తుల దాష్టీకం కూడా చేశారట. అసలు ఇంతకీ అక్కడ ప్రమాదం జరిగన లారీలో ఎంత మంది ఉన్నారు. వీరంతా గాయాలతో బయటపడ్డారా.. ప్రాణాలు కోల్పోయారా! పొట్టకూటి కోసం ఎట్నుంచో వచ్చిన వీరి గురించి కనీస సమాచారం కుటుంబాలకైనా పంపారా! ఇవన్నీ గనుల్లో మారు మోగుతున్న విషాదాల ఆనవాళ్లు.. వెలుగుచూడని ఎన్నో దారుణాలకు ఉదాహరణ మాత్రమే!