ఆంధ్ర-ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టుల దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల భారీ ఎత్తున పోలీసులపై కాల్పులు జరిపారు. రెండ్రోజులుగా రహదారి మార్గం వేస్తున్న కాంట్రాక్టర్లను లక్ష్యం చేసుకున్నారు. రెండు వాహనాలను తగులబెట్టారు. దీనిపై స్థానికంగా మద్దతునిచ్చేప్రజల నుంచి వారికి వ్యతిరేకత వ్యక్తమవటం విశేషం. తాజాగా సోమవారం మావోలకు వ్యతిరేకంగా చింతూరు మన్యంలో ఆదివాసీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. తమకు అవసరమైన వంతెన పనులు అడ్డుకోవటం భావ్యం కాదంటూ గ్రామస్తులు కోరారు. వానాకాలం.. వరదలు ముంచెత్తే వేళ తమకు ప్రాణసంకటంగా మారిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన వంతెన నిర్మాణాన్ని పూర్తయ్యేలా సహకరించాలని కోరటం విశేషం.