నలభై ఐదేళ్ల క్రితం.. సాధారణ కానిస్టేబుల్ ఇంట్లో పుట్టిన పిల్లలు. చాలీచాలని జీతంతో ఐదుగురు పిల్లలు. తండ్రి కష్టాన్ని కళ్లారా చూసిన పెద్దబ్బాయి.. శ్రమనే పెట్టుబడిగా పెట్టాడు. స్వయంకృషితో ఎదిగాడు. చెమటనే చిందిస్తే.. ఎవరైనా అసాధ్యాలను సుసాధ్యం చేయగలడని నిరూపించాడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనే సూత్రాన్ని నమ్మాడు. హెమాహేమీలు ఉన్న సమయంలోనే ఇంతింతై.. వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు. కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా రూపాంతంరం చెందాడు. మెగాస్టార్‌గా అంచెలంచెలుగా ఎదిగాడు.. మూడున్నర దశాబ్దాలుగా నెంబర్ వన్‌గా నిలిచాడు.. తనతోపాటు.. తనవాళ్ల చేయి పట్టుకుని విజేతలుగా నిలిపాడు. కోట్లాది మంది గుండెల్లో ఖైదీ అయ్యాడు… ఎంతగా అంటే.. అంబానీ.. ఆదానీలు కుటుంబాలు మాత్రమే జరుపుకునే చోట.. ఇప్పుడు తన సోదరుడి కూతురు నిహారిక పెళ్లి వేడుక జరిపేంతగా చేరాడు. డిసెంబరు 9 ఆసియాలోనే అత్యుత్తమ ప్యాలెస్ అయిన రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ తాజ్‌లో గ్రాండ్‌గా నిహారిక, చైతన్యను ఒకటయ్యారు. మెగా పెళ్లి సందడి ఎలా ఉంటుందనేది అభిమానులకు కళ్లకు కట్టారు. ఎవరూ ఊహించని విధంగా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లివేడుకలు నబూతో నభవిష్యత్ అనిపించాయి. సాధించాలనే పట్టుదల.. సాధించగమలనే ఆత్మవిశ్వాసంతో ఎవరైనా.. ఏదైనా సాధించగలరనేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే.