చిరంజీవి.. నాలుగు అక్షరాలు. బాక్సాఫీసు బద్దలు కొట్టే కలెక్షన్లు ఇవ్వగలదు. కొత్తగా వెండితెరపై రావాలనే యువతకు బోలెడు ఉత్సాహాన్ని నింపగలదు. గెలుపోటముల మధ్య నలిగే ఎందరిలోనో స్పూర్తిని నింపగలదు. స్టెప్పులతో ఎన్నో పాఠాలు.. మేనరిజంతో మరెన్నో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన సినిమాలున్నాయి. విజయం ఊరికే వరించదు.. దానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. మరెన్నో అడ్డంకులను అధిగమించాలి. రాత్రికి రాత్రే ఎవ్వరూ మెగాస్టార్‌లు కారు.. ఎంత శ్రమిస్తేనో.. మరెంతగా కష్టపడితేనో.. కుటుంబానికి దూరంగా రోజులు.. నెలలు.. ఏళ్లు తరబడి పరిశ్రమిస్తేనో నెంబర్‌వన్ స్థాయికి చేరుకోలేరు. అలా ఆలయశిఖరంగా మారిన అన్నయ్య విజయానికి కేరాఫ్ చిరునామా. ముగ్గురు పిల్లల బాల్యాన్ని.. వారి చిట్టిపొట్టి అడుగులను.. వచ్చీరాని మాటల్లోని తీయదనం తాను ఆస్వాదించలేకపోయానంటూ పల ఇంటర్వ్యూల్లో చిరంజీవి తనలో మిగిలిన చిరు బాధను బయటపెడతుంటారు.
విమర్శలను కాలర్‌పై పడిన దుమ్ముగా భావించే అన్నయ్యకు.. ప్రశంసలంటే బోలెడు భయం. ఎవరైనా తనను పొగిడిన రోజు.. ఇంటికెళ్లాక నేలపై పడుకుంటారట. ఎందుకని అడిగితే.. గర్వం తలకెక్కకుండా ఉండేందుకంటూ వాస్తవాన్ని దర్జాగా చెప్పిన విజేత. 1955 అగస్టు 22న పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో పుట్టిన కొణిదెల శివశంకర వరప్రసాద్.. వెండితెరపై చిరంజీవిగా ఎదిగాడు. ఇప్పుడు ప్రేక్షకుల గుండెల్లో అందరివాడుగా ఉన్నాడు. ఏళ్లు గడచినా.. హిట్లర్‌పై అభిమానుల ప్రేమ కాస్తయినా తగ్గలేదు. అందుకేనేమో.. 65 ఏట అడుగుపెట్టబోతున్న చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను నెల రోజుల ముందు నుంచే ఫ్యాన్స్ జరుపుకుంటున్నారు. పుట్టినరోజంటే కేకులు కోయటం.. పూలదండలు వేయటమే కాదు.. చిరంజీవి అడుగుజాడల్లో రక్తదానం చేస్తున్నారు. కరోనా రోగుల కోసం ప్లాస్మాదానంపై ప్రచారం చేస్తున్నారు. సత్య దివ్యాంగుల సేవాసమితీ పేదలు, ప్రత్యేక అవసరాలు గల వారికి ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తున్నామంటున్నారు .
పశ్చిమకృష్ణ చిరంజీవి యువత అధ్యక్షుడు తోట మురళీకృష్ణ. ఈ లెక్కన.. అగస్టు 22న ఇంకెంతగా రికార్డులు సృష్టిస్తారో చూడాలి మరీ.
కృష్ణా జిల్లాలో పశ్చిమ కృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కమిశెట్టీ వేంకటేశ్వరరావు , నందిగామ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు రామిరెడ్డి వీరబాబు , నందిగామ చిరంజీవి యువత అధికార ప్రతినిధి పోలిశెట్టి కోటేశ్వరరావు , కంచి వెంకట్రావు, పూజారి రాజేష్, తాటి నరేంద్ర , తుటారి చిరంజీవి , పవన్ కుమార్, రామిరెడ్డి సూర్యం, రామిరెడ్డి లక్ష్మణ్రావు చురుగ్గా కార్యక్రమాలు చేపడుతున్నారు.