మీరు చదివింది నిజమే.. అగస్టు 5న అయోధ్యలో రామమందిర భూమి పూజకు ముఖ్య అతిథిగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాబోతున్నారు. ఎన్నో వందల ఏళ్లనాటి హిందువుల స్వప్పం నరేంద్రుడి హయాంలో నెరవేరబోతుంది. న్యాయపరమైన చిక్కులు దాటుకుని రామయ్యకు అందమైన మందిరాన్ని నిర్మించబోయే శుభతరుణం వచ్చేసింది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అధినేత మోహన్ భగవత్‌ను ఆహ్మానించటం మరింత ఆనందకరంగా హిందువులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో సహా కేవలం 150 మంది మాత్రమే భూమి పూజ మహోత్సవంలో పాల్గొనబోతున్నారు. ఈ ఆహ్వాన పత్రికను కాషాయ రంగులో ముద్రించి ఆహ్వానితులకు అందజేస్తున్నారు. ఈ మేరకు అయోధ్యలో పక్కా భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల సహాయంతో పహారా కాస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా అప్రమత్తమయ్యేందకు వీలుగా భద్రతా బలగాలు రెడీగా ఉన్నాయి.