కరోనా విజృంభిస్తోంది. బయటకు వచ్చేందుకు కూడా భయమేసేంతగా విస్తరిస్తోంది. దీంతో అత్యవసర సమయంలో రక్తం అవసరమైన ప్రమాద బాధితులు, రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి చెక్ చెప్పాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలోని సైబరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సారథ్యంలో పోలీసులు రక్తదానం చేస్తున్నారు. క్యాన్సర్, తలసీమియా, కిడ్నీ రోగుల ప్రాణాలు నిలిపేందుకు దీన్ని ఉపయోగించనున్నారు. ఇప్పటి వరకూ 1532 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఉస్మానియా ఆసుపత్రి, రెడ్ క్రాస్ సొసైటీ, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన రక్తదాన శిబిరంలో పాల్గొనేందుకు ఆసక్తిగల వారికి ఆహ్వానం పలుకుతున్నారు. వివరాలకు 7901125460 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.