బాబోయ్.. ఏం దులుపుతున్నాడు. అసలు టీడీపీ నేతలు కానీ.. అటు జనసేన ఎవ్వరూ ఇంతగా అధికార పార్టీపై దుమ్మెత్తిపోయట్లేదు. అతడు సినిమాలో తనికెళ్ల భరణి అన్నట్టు ఆడు మగాడ్రా బుజ్జీ అంటూ అమరావతి రైతులు ముఖానే చెప్పేస్తున్నారు. ఏపీలో ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలున్నా తమ తరపు ఎవ్వరూ మాట్లాడటం లేదంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఒక్క మగాడుగా వర్ణించారన్నమాట. ఏమైనా వైసీపీ ప్రభుత్వానికి రఘురాముడు కొరకరాని కొయ్యగా మారాడు. ఏ ముహూర్తాన.. వైరం మొదలైందో కానీ సొంతపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు సీఎంను కూడా వదలట్లేదు. అవకాశం చిక్కినప్పుడల్లా చురకలు వేస్తూనే ఉన్నారు. మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకు అన్నట్టుగా వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఓ వైపు వైసీపీను తూలనాడుతూనే.. మరోవైపు బీజేపీ సర్కారు ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అబ్బో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో జగన్ వైఖరిని తూర్పారబడుతూనే.. సారూ.. పాపం వాళ్లను ఎందుకు కుక్కలుగా పోల్చుతారు. రేపు వాళ్లే వేటకుక్కలుగా వెంటాడతారంటూ గిల్లి మరీ జోలపాడినంత పనిచేశాడు. ఏమైనా రఘురాముడు ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు అత్యంత ఆప్తుడు. రాజధాని రైతులకు కొండంత అండ. అందుకేనేమో.. కేంద్రం ఎంపీగారు అడగ్గానే వెంటనే 11 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. పైగా ఎప్పటికప్పుడు రఘురాముడు చుట్టూ జరిగే విషయాలను ఏకంగా కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తుందట. ఈ లెక్కన ఎటుచూసినా ముల్లుగా మారిన ఎంపీను ఏం చేయాలో తెలియక అధికార పక్షం తలపట్టుకుంటుందట.
అన్నీ కీలకవిషయాలు ఆయనకు తెలుసు. విమర్శించడం సులువు
ఆర్టీకిల్ బాగుంది