ప్రాణికోటి జీవనానికి ఆధారం…ఆహారం…
భగవంతుడు మనకి ఉచితంగా ఇచ్చిన సూర్యరశ్మి, గాలి, నీరు సహాయంతో మట్టిలో పండించినదే ఆహారం…
కనుక అన్నపదార్థములు బ్రహ్మము…
అటువంటి బ్రహ్మ పదార్ధములకు మూలము మట్టి…
బాధ్యత ఫౌండేషన్ ద్వారా, 130 ఎకరాలకు పైగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఈ నేలమ్మ తల్లిని కాపాడుతూ, పండిన పంటని ప్రసాదంగా భావించి,మన అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న రైతుకు మరియు ఈ నేలమ్మ తల్లి కి అనేక అనేక నమస్కారములు….
బాధ్యత ఫౌండేషన్ ద్వారా పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను, జనహిత ఫార్మర్ ఆర్గానిక్ స్టోర్ నందు కొనుగోలు చేస్తున్న మీరు కూడా ఈ పుణ్య కార్యములో భాగస్వాములే…
నేలమ్మ తల్లి కి ఒక రెండు సెకన్లు మీ మనసులో కృతజ్ఞతలు తెలియజేయండి.
మీ అందరికీ మరొక్కసారి ప్రపంచ మట్టి దినోత్సవ శుభాకాంక్షలు.
ఇట్లు,
అపర్ణచంద్రశేఖర్,
బాధ్యత ఫౌండేషన్,
జనహిత ఫార్మర్స్ ఆర్గానిక్ స్టోర్,
హైదరాబాద్.
8008 42 43 44