హమ్మయ్య.. 2020 ముగియబోతుంది. ఎంచక్కా కొత్త ఏడాది 2021లో వ్యాక్సిన్ వస్తోంది. మాస్క్‌లు తీసేని హాయిగా జీవితాన్ని గడిపేయవచ్చని బోలెడు ఆశ పెట్టుకున్న ప్రపంచానికి కొత్త వైరస్ కరోనా స్ట్రెయిన్ రూపంలో భయపెడుతోంది. ఏపీ, తెలంగాణలకు బ్రిటన్ వచ్చిన ప్రవాసాంధ్రులతో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ నుంచి భారతదేశానికి వచ్చిన 33000 మందిలో 113 మందికి కొత్త కరోనా వచ్చినట్టు నిర్దారించారు. వీరిలో హైదరాబాద్, వరంగల్‌లో ఐదుగురు ఉన్నారు. వీరి ద్వారా సుమారు 20 మంది వరకూ కాంట్రాక్టు అయినట్టు గుర్తించారు. ప్రస్తుతానికి వీరందరకీ ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. కరోనాతో పోల్చితే స్త్రెయిన్ కరోనా వేగంగా వ్యాప్తి చెందటం. పిల్లలు, యువకులు ఎక్కువగా వైరస్ భారీనపడటం ఆందోళన కలిగిస్తోంది. సీసీఎంబీ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఐదుగురు వైరస్‌కు గురయ్యారు. వీరి ఎంతమందికి వైరస్ సోకించేందుకు కారణమయ్యారనేది తెలియాలంటే మరో వారం ఆగాలంటున్నారు వైద్యాధికారులు.
ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కానీ.. ఇప్పటికే వైరస్ జనాల్లోకి చేరి ఉంటుందనే ఊహాగానాలు పెరిగాయి. ప్రజలు కూడా ఉదాశీనంగా ఉండటం.. మాస్క్‌లు, వ్యక్తిగత దూరం, చేతులు శుభ్రపరచుకోవటం కూడా మరచిపోయారు. ఇటువంటి సమయంలో కొత్త వైరస్ వేగంగా వ్యాపించేందుకు పరోక్షంగా కారకులవుతున్నారు. 2021 ప్రారంభానికి ముందే కొత్త కరోనా మోగించిన డేంజర్ బెల్స్.. 2021 ఏడాది మొత్తం ఆడేసుకుంటుందంటున్నాయి వైద్యవర్గాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా చివరి వైరస్ కాదని.. ఇటువంటి వైరస్‌లను ఎదుర్కొనేందుకు మానవాళి సిద్ధం కావాలంటూ ఇటీవల పిలుపునిచ్చారు. అసలే చలిగాలులు తీవ్రంగా ఉన్నాయి. కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇటువంటి వాతావరణంలో వైరస్ వేగంగా విస్తరిస్తుందనే ఆందోళన కూడా లేకపోలేదు. ఏమైనా కొత్త ఏడాది సంబరాలకు జనం దూరమవ్వాల్సిందే. కాదని.. సరదాలు తీర్చుకునేందుకు గడపదాటితే. మున్ముందు భారీమూల్యం చెల్లించాల్సి ఉంటుందనేది వైద్యనిపుణుల హెచ్చరిక.