కృష్ణాజిల్లా విజయవాడ కు చెందిన యువతికి అరుదైన గౌరవం దక్కింది. విజయవాడకు చెందిన బి. నాగదుర్గా కుసుమసాయి అనే యువతి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ఇతర తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్‌లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీల్లో ఆమె ఈ కిరీటాన్ని సాధించింది.
ఈ పోటీల్లో మొత్తం 600 మంది యువతులు పాల్గొన్నారు. వారిలో కుసుమసాయి పోటీల్లో విజేతగా నిలిచి ఈ అరుదైన గౌరవం దక్కించుకుంది. తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీల్లో కుసుమసాయి విజేతగా నిలిచిందని పోటీ నిర్వాహకులు చైతన్య పొలుజు తెలిపారు. కుసుమసాయి ప్రస్తుతం డిగ్రీ చదువుతూ నాట్యం,నాటక రంగాల్లో శిక్షణ పొందుతోంది.