ఔను.. కరోనా అనగానే భయపడే రోజులు పోతున్నాయి. వస్తే ధైర్యంగా పోరాడుదామనే ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. మొన్న దర్శకుడు రాజమౌళి తనకు కరోనా రాగానే.. వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మాట తగ్గగానే ప్లాస్మా దానం చేస్తానంటూ ఎంత పాజిటివ్‌గా స్పందించారు. ఆ ఒక్కమాట చాలు.. వైరస్‌ను ఎదిరించాక. మనం ఇవ్వబోయే 400 ఎంఎం ప్లాస్మా నాలుగు నిండు ప్రాణాలను కాపాడుతుందనే గొప్ప భావన. తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ ఆర్గనైజేషన్‌తో కలసి ప్రతిరోజూ కరోనా భారినపడి తగ్గిన వారి నుంచి ప్లాస్మా సేకరిస్తున్నారు. ఆసక్తిగల వారిని ఆదరంగా ఆహ్వానిస్తున్నారు కూడా సైబరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మరీ ప్లాస్మా సేకరణపై అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్ 19 వారియర్స్ గా నిలిచిన వారిలో ఇప్పటి వరకూ 195 మంది ప్లాస్మా దానం చేశారు. ఆపదలో ఉన్న వందలాది మందిని కాపాడేందుకు కారకులయ్యారు.
కరోనా వైరస్ భారినపడి తగ్గిన వారు… ప్లాస్మా దానం చేయాలనుకున్నా.. లేదా.. ఎవరైనా ఆపదలో ఉండి ప్లాస్మా అవసరమైనా
వెంటనే సైబరాబాద్ పోలీసులను సంప్రదించవచ్చు. వివరాలకు Register at https://donateplasma.scsc.in/. Contact Cyberabad Covid Control Room: 9000257058, 9490617440 మరియు https://donateplasma.scsc.in/ వెబ్‌సైట్లను చూడవచ్చు. ప్లాస్మా దానం పేరిట ఎవరైనా మాయగాళ్లు సంప్రదిస్తే 9490617444 ఈ నెంబరుకు ఫోన్ చేయమని సీపీ సజ్జనార్ సూచించారు.