క‌రోనాను ఇలా ఎదిరిద్దాం!

క‌రోనా వైర‌స్ బారిన ప‌డి మ‌ర‌ణిస్తున్న వారిలో 68 శాతం పురుషులు.. 32 శాతం మ‌హిళలు ఉంటున్నారు. వీరిలో అధిక‌శాతం 37-60 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల వారున్నారు. దేశ‌వ్యాప్తంగా 2 కోట్ల మందికి కొవిడ్ 19 ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మార్చినెల‌లో ఉన్నంత‌గా వైర‌స్ ప్ర‌భావం చూప‌ట్లేద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీతో స‌హా భార‌త్‌బ‌యోటెక్ కూడా భార‌త్‌లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తిచేసింది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా భార‌త్ బ‌యోటెక్ ల్యాబ్‌ను సంద‌ర్శించారు. వాట‌ర్ బాటిల్ కంటే త‌క్కువ ధ‌ర‌కే వ్యాక్సిన్ అందుబాటులోకి అంటూ ప్ర‌క‌టించారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది.. కానీ ఒక‌వేళ వైర‌స్ రాకుండా ఏం చేయాలి? వైర‌స్ భారిన ప‌డితే అప్పుడెలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

ఒళ్లునొప్పులు,ద‌గ్గు, జ్వ‌రం అనిపిస్తే ఏ మాత్రం అల‌క్ష్యం చేయ‌వ‌ద్దు. వెంట‌నే ప‌రీక్ష చేయించుకోవాలి. ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కు దూరంగా మెల‌గ‌టం ప్రారంభించండి. వైద్య‌ప‌రీక్ష‌లో నెగిటివ్ వ‌స్తే.. ఛాతీ ఎక్స్‌రే లేక‌పోతే సిటీస్కాన్ ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయండి.

క‌రోనా భారీన ప‌డ‌కుండా ఉండేందుకు స‌మూహంలో క‌ల‌వ‌కుండా దూరంగా ఉండాలి. ఇది త‌ప్ప‌నిస‌రిగా ఆచ‌రించాల్సిన విష‌యం. రెండోది బ‌య‌ట‌కు వెళ్లిన‌పుడు మాస్క్ ధ‌రించాలి. బ‌య‌ట‌కు వెళ్లొచ్చిన‌పుడు చేతులు స‌బ్బుతో క‌నీసం నిమిషం వ‌ర‌కూ శుభ్ర‌ప‌ర‌చుకోవాలి. మ‌రో విష‌యం గుర్తుంచుకోవాలి. ఎట్టిప‌రిస్థితుల్లో చేతులను త‌ర‌చూ ముఖానికి, ముక్కు, నోటికి ద‌గ్గ‌ర‌గా తీసుకెళ్ల‌వ‌ద్దు. ఇప్పుడు వైర‌స్ భారిన ప‌డుతున్న వారిలో అధిక‌శాతం ఇదే కార‌ణం. మ‌రో విష‌యం కూడా గుర్తుంచుకోవాలి. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో.. కామ‌న్ బాత్రూమ్ వాడ‌కంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. వీలైనంత వ‌ర‌కూ వాటికి దూరంగా ఉండ‌టం మేలు.

ఒక‌వేళ వైర‌స్‌కు గురైతే..? మొద‌ట చేయాల్సిన ప‌ని గుండె ధైర్యంగా ఉండాలి. ఏ మాత్రం మ‌నోనిబ్బ‌రాన్ని కోల్పోకూడ‌దు. పాజిటివ్‌ను ఎదిరించేందుకు పాజిటివ్ ఆలోచ‌న‌లు ర‌క్ష‌ణ‌నిస్తాయేది సైకియాట్రిస్టుల సూచ‌న‌. ఆక్సిమీట‌ర్ త‌ప్ప‌నిస‌రిగా కొనుక్కోండి. ఆరోగ్యవంత‌మైన శ‌రీరంలో 98 శాతం ఆక్సిజ‌న్ ఉంటుంది. వైర‌స్‌కు గురైన వారిలో 93శాతం కంటే త‌గ్గితే.. అది కూడా వ‌రుస‌గా మూడుసార్లు అదే విధంగా వ‌చ్చిన‌ట్ట‌యితే వెంట‌నే ఆసుప‌త్రిలో చేరాలి. జ్వ‌రం, ద‌గ్గు, గొంతునొప్పి ఇవ‌న్నీ త‌గ్గించే సుగుణం ఆవిరికి ఉంది. వేడినీటిలో కాస్త ప‌సుపు వేసుకుని మూడు పూట‌లా ఆవిరి ప‌ట్టాలి. గోరువెచ్చ‌ని నీటిలో కాస్త ఉప్పు క‌లిపి మూడుసార్లు పుక్కిలించాలి.

ఆహారం చాలా ముఖ్యం.. ఉద‌యం లేవ‌గానే ప‌ళ్లుతోమి.. కాసేపు ప్రాణాయామం అది కూడా అనులోమ‌, విలోమ ప‌ద్ద‌తిలో చేయాలి. ఊపిరితిత్తుల‌పై ఒత్తిడిప‌డే విధంగా వ్యాయామం, న‌డ‌క మంచిది కాదు. ఆ త‌రువాత గోరువెచ్చ‌ని నీటిలో కాస్త తేనే, నిమ్మ‌కాయ పిండుకొని తాగాలి. రాత్రివేళ నీటిలో నాన‌బెట్టిన బాదం ప‌ప్పును తెల్లారే పొట్టుతీసి తినాలి. ఉద‌యం, సాయంత్రం గుడ్డు త‌ప్పని స‌రి. రెండింట్లో ఉండే ప్రోటీన్లు శ‌క్తినిస్తాయి. నిస్స‌త్తువ‌ను దూరం చేస్తాయి. పండ్లు, కాయ‌గూరల ముక్క‌లు ఉద‌యం సాయంత్రం తీసుకోవాలి.

మందుల విష‌యానికి వ‌స్తే అజిత్రోమైసిన్ యాంటీబ‌యాటిక్‌గా ప‌నిచేస్తుంది. డి360కే వారానికి ఒక‌టి చొప్పున నెల‌రోజులు అంటే
నాలుగు వేసుకోవాలి. సీ విట‌మిన్ కోసం సక్సీ రోజుకు మూడు చ‌ప్ప‌రిస్తే చాలు. మ‌నసులో ఆందోళ‌న‌గా అనిపిస్తే బీ కాంప్లెక్స్ చ‌క్క‌గా ప‌నిచేస్తుంది.

హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌పుడు. మాస్క్ త‌ప్ప‌నిస‌రి. ఒకే బాత్రూం ఉప‌యోగించాల్సి వ‌స్తే.. మీరు వెళ్లి వ‌చ్చాక అర‌గంట వ‌ర‌కూ ఎవ్వ‌రూ వెళ్ల‌కుండా చూడాలి. డెట్టాల్‌, బ్లీచింగ్ పౌడ‌రుతో శుభ్రం చేస్తుండాలి. ఇంట్లో అంద‌రూ 6 మీట‌ర్ల దూరం, మాస్క్‌లు ధ‌రించ‌టం ద్వారా వైర‌స్ వారికి వ్యాపించ‌కుండా కాపాడిన‌వార‌వుతారు.

వైర‌స్ నెగిటివ్ వ‌చ్చిన త‌రువాత కూడా నీర‌సం, అల‌స‌ట‌, ఆయాసం వంటి ల‌క్ష‌ణాలుంటాయి. దీర్గ‌కాలిక వ్యాధులు అంటే బీపీ, షుగ‌రు ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లుంటే ముందుగానే వైద్యుల స‌ల‌హా తీసుకుని ఆసుప‌త్రిలో చేర‌టం ఉత్త‌మం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here