ఏపీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న విద్యాకానుక వస్తువులను సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. కేంద్రం లాక్‌డౌన్4.0 ఆంక్షలు ఎత్తేయటంతో విద్యాసంవత్సరం ప్రారంభానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద మూడు జతల యూనిఫామ్, ఒక జత బూట్లు, నోటు, పాఠ్యపుస్తకాలు, బ్యాగులు తదితర వస్తువు పంపిణీ చేయనున్నారు. విద్యార్థులకు అందించబోయే స్కూల్ బ్యాగులను సీఎం జగన్ మోహన్‌రెడ్డి మంత్రి ఆదిమూలపు రమేష్‌తో కలసి పరిశీలించారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయుల దినోత్సవం నుంచి పథకం అమల్లోకి రానుంది.