కోవిడ్‌ –19 పరిస్థితులపై సీఎం సమీక్షా సమావేశం

కోవిడ్‌ –19 పరిస్థితులపై సీఎం సమీక్షా సమావేశం జరిగింది. కోవిడ్‌ఆస్పత్రుల్లో 37,441 బెడ్లు
ఇవ్వాళ్టికి సాధారణ బెడ్లు 2,462, ఆక్సిజన్‌ సపోర్టుతో ఉన్న బెడ్లు 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఇంకా ఖాళీగా ఉన్నాయన్న అధికారులు
కావాలనే కొన్ని పత్రికలు విషపూరిత రాతలు రాస్తున్నాయని సమావేశంలో చర్చలో తెలిపారు కోవిడ్‌ ఆస్పత్రుల్లో తాత్కాలిక నియామకాలపై వివరాలు అందించిన అధికారులు మొత్తం 30,887 పోస్టులకు గానూ 21,673 తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ
రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌లో 9,971 పోస్టులు అందులో 4,676 పోస్టులు నియామకం, 5,295 పోస్టుల భర్తీకి కొనసాగుతున్న ప్రక్రియ
మరో 10 రోజుల్లో ఈ పోస్టుల భర్తీ పూర్తవుతుందన్న అధికారులు కోవిడ్‌కోసం ప్రస్తుతం ప్రతిరోజూ రూ. 10.18 కోట్లు ఖర్చు
కోవిడ్‌ టెస్టులకోసం రూ. 4.3 కోట్లు ,ఆహారం కోసం రూ.1.31 కోట్లు,మందులు కోసం రూ. 4.57 కోట్లు ఖర్చు అయిందని తెలిపారు.

హెల్ప్‌ డెస్క్‌లను ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో పెట్టాలి: సీఎం
ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం
ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటుచేయాలి:
ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలి:
ఎంపానల్‌ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్‌ డెస్క్‌ కచ్చితంగా ఉండాలి:
రిఫరల్‌ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలి:

కోవిడ్‌ ఆస్పత్రుపై ఎలాంటి సమీక్ష చేస్తున్నామో అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఎంపానల్డ్‌ ఆస్పత్రులపై సమీక్ష చేయాలి:సీఎం
రోగులకు వైద్యం సరిగ్గా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రలదే:సీఎం

పతిరోజూ అధికారులు కాల్‌ సెంటర్లకు మాక్‌ కాల్‌ చేసి పనితీరును పరిశీలించాలి,ప్రతి మాక్‌ కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను కూడా రికార్డు చేయాలి అని చెప్పారు.

ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలికసదుపాయాలు.. ఈనాలుగు పారామీటర్స్‌ మీద ప్రశ్నలు వేసి.. రోగులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి
వీటిద్వారా ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వండి:

కొత్త వైద్య కళాశాలల నిర్మాణంకోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం.
ప్రజారోగ్య వ్యవస్థను కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు బలోపేతం చేస్తాయన్న సీఎం జగన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here