ఆంధ్రప్రదేశ్ మద్యవిమోచన ప్రచార కమిటీ షార్ట్ ఫిల్మ్ పోటీలు

ఆంధ్రప్రదేశ్ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ పోటీలకు సంబంధించి పోష్టర్లను గురువారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, ఐఅండ్ పీఆర్ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి , మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు ఆవిష్కరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని ప్రభుత్వ మీడియా సెల్ లో ఈ పోష్టర్ల ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్ తదితరులు ఉన్నారు.

షార్ట్ ఫిల్మ్ పోటీల వివరాలు
————————————
ఆంధ్రప్రదేశ్ మద్యవిమోచన ప్రచార కమిటీ
(ఏపీఎంవీపీసీ) లఘుచిత్రాshort film competition (షార్ట్ ఫిల్మ్) పోటీలు నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఔత్సాహికులను ఆహ్వానిస్తుంది. ‘మద్యం మహమ్మారి దుష్ప్రభావాలు.. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న దశలవారీ మద్యనిషేధం’ అనే టాపిక్ పైన షార్ట్ ఫిల్మ్లు తీయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం నియంత్రణకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల అమలుతో క్షేత్రస్థాయి సత్ఫలితాలు షార్ట్ ఫిల్మ్ ప్రధానాంశమై ఉండాలి. మద్యం బెల్టుదుకాణాల తొలగింపు, పర్మిట్ రూమ్లు రద్దు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో నడుస్తున్న మద్యం దుకాణాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని నిర్వహించడం, దుకాణాల సంఖ్యను భారీగా తగ్గించడం, ధరల పెంపుతో మద్యం వినియోగం తగ్గించడం, మద్యం విక్రయ వేళల నియంత్రణ, డీ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుతో మద్యం వ్యసనపరులతో దురలవాట్లు మాన్పించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చడం.. తద్వారా ఆంధ్రప్రదేశ్ లో అక్కాచెల్లెమ్మల కళ్లల్లో ఆనందం వెల్లివిరియడం.. వ్యసనాల బారి నుంచి విముక్తి పొందిన వారు ఇంటిల్లి పాది కుటుంబంతో గడుపుతూ కళకళలాడుతూ మద్యరహిత ఆంధ్రప్రదేశ్ అవతరించే వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్న అంశాలతో షార్ట్ ఫిల్మ్ లు తీయాల్సి ఉంది. ఐదు నిముషాల నుంచి నిమిషాల నిడివితో షార్ట్ ఫిల్మ్ ఉండాలి. తెలుగు భాషలో మాత్రమే ఫిల్మ్ తయారు చేయాలి. పోటీల్లో పాల్గొన్న ఉత్తమ 15 షార్ట్ ఫిల్మ్స్ ఎంపిక చేస్తారు. వాటిల్లో నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకింద బెస్ట్ 5 ఫిల్మ్ ల చొప్పున ఎంపిక జేయడం జరుగుతుంది. ప్రథమ బహుమతి వరుసలో ఉన్న బెస్ట్ 5 ఫిల్మ్లకు ఒక్కోదానికి రూ.10 వేల నగదు, ద్వితీయ బహుమతి వరుసలో ఉన్న బెస్టు 5 ఫిల్మ్ లకు ఒక్కోదానికి రూ. 7,500 నగదు, తృతీయ బహుమతి వరుసలో ఉన్న బెస్టు 5 ఫిల్మ్లు ఒక్కోదానికి రూ. 5వేల చొప్పున నగదు అందజేయడం జరుగుతుంది. ఉత్తమ దర్శకత్వంకు రూ.5వేలు, ఉత్తమ రచనకు రూ.5వేలు, ఉత్తమ నటి (లేదా)నటుడు రూ.5వేల నగదు ఉంటుంది. విజేతలకు నగదు పారితోషకం, ప్రభుత్వ ప్రశంసాపత్రం జ్ఞాపికతో పాటు సత్కారం ఉంటుంది. షార్ట్ఫెల్మ్లు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 25వ తేదీ. ఎంపికైన విజేతలను సెప్టెంబర్ 28న ప్రకటిస్తారు. అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి రోజున విజేతలకు బహుమతుల ప్రదానంతో పాటు సత్కార కార్యక్రమం ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఉచితం. షార్ట్ ఫిల్మ్స్ పంపాల్సిన మెయిల్ ఐడి: apmvpc.gov.in@gmail.com మరింత సమాచారం కోసం 9381243599 నంబర్లలో సంప్రదించవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here