ఏంది సామీ ఇదంతా.. అపుడెపుడో బోరింగ్ పంపుల దగ్గర ఆడోళ్లు ఒకరి గుట్టు మరొకరు బయట పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు పాతస్నేహాలు మరచి మరీ గుప్పెట రహస్యాలు ఇలా బయటపెట్టేసుకుంటున్నారు. ఇవన్నీ వాస్తవం అనేంత స్ట్రాంగ్‌గా కౌంటర్‌లు ఇచ్చుకుంటున్నారు. ఇదంతా టీవీ ప్రేక్షకులకు గొప్ప ఆటవిడుపు. లాక్‌డౌన్ పుణ్యమాంటూ సినిమా థియేటర్లు మూసివేశారు. మెగాస్టెప్పులు.. బాలయ్య డైలాగ్‌లు దూరం కావటంతో ఫ్యాన్స్ లో హుషారు తగ్గింది. ఇప్పుడు.. కృష్ణాజిల్లా అధికార, ప్రతిపక్ష నేతలు.. కొడాలి నాని.. దేవినేని ఉమా మహేశ్వరరావు పుణ్యమాంటూ ఆ కొరత తీరినట్టయింది. ఏమైనా.. జగన్ అంటే కొడాలికి ఎంత ప్రేమో.. ఉమాకు కూడా చంద్రబాబు అంటే అంతటి గౌరవం అనేది మాత్రం తెలిసింది.
అసలు సంగతి ఏమిటంటే.. నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకునేంతగా ఇద్దరూ తలపడటం మాత్రం ఇదే తొలిసారి.. టీడీపీ అధికారంలో ఉన్నపుడు.. లేనపుడు వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిపై ఒంటికాలిపై లేచింది ఎవరంటే.. దేవినేని ఉమాయే. ఇప్పుడు దానితాలూకూ ప్రతీకారం తీర్చుకునే అవకాశం రావటంతో కొడాలి నాని అస్త్రంగా మారాడు. అసలే కృష్ణాజిల్లా.. మాటకు ముందు.. తరువాత.. తప్పకుండా బీప్ శబ్ధాలు ఉండాల్సిందే. మీడియా సమావేశంలో మంత్రి కొడాలి.. ఉమా మీ అయ్య ఏమైనా జాగీరా అంటూ నిలదీశాడు. కంచికచర్లలో సోడాలు అమ్ముకున్నావంటూ ఎద్దేవాచేశాడు. వదినను చంపిఎమ్మెల్యేవు అయ్యావంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు రాజకీయ బిక్ష పెట్టింది. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనంటూ… చంద్రబాబు తాత లవంగం నాయుడు కాదంటూ ఘాటుగానే స్పందించారు. ఉమాక్క కాచుకో అంటూ.. చాలా వ్యగ్యంగా కొడాలి
నాని మాజీ మంత్రి ఉమా కు సవాల్ విసరటం కొసమెరుపు.
మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ధీటుగానే ప్రతిస్పందించారు.. ఆ నాడు వైశ్రాయ్ హోటల్ ఘటనలో చంద్రబాబు పక్కనే ఉన్నావనే సంగతి మరచిపోయావంటూ గుర్తు చేశారు. రెండుసార్లు చంద్రబాబు ఎమ్మెల్యేను చేశాడన్నారు. లారీ ఛాయిస్‌లకు బాడీ తొడిగించి.. కోట్లాదిరూపాయల ఇసుకను హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నాడని ఆరోపించారు. గుడివాడలో పేకాట క్లబ్బులు నడిపిస్తూ గబ్బు పట్టావంటూ ఆరోపణలు చేశారు. అవన్నీ తాడేపల్లిలో జే ట్యాక్స్ కడుతున్నాడంటూ స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు. ఏమైనా.. ఉమా ఒకప్పడు తమపై చూపిన పెత్తనానికి వల్లభనేని వంశీ, కొడాలి నాని తదితర బ్యాచ్ అంతా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైందనేది మాత్రం అర్ధమవుతుంది. పోలవరం నిర్మాణంలో ఉమా చేసిన అవినీతిని బయటకు తీసి జైలుకు పంపాలని కూడా వైసీపీ సీనియర్లు మాంచి పథకరచన చేస్తున్నట్టు గుసగుసలూ లేకపోలేదు.
Video Link for above article:
https://www.youtube.com/watch?v=t6CTKe-VkXI&t=90s
ఇటువంటి నాయకులు కలిగి ఉందట ప్రజల అదృష్టం.. మంచి విజ్ఞత హుందా తనం, సామాజిక స్పృహ..చాలా నేర్చుకోవాలి రాబోయే తరం…