విజయవాడలో స్వర్ణప్యాలెస్ ఘటనపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు నిలిపివేయమంటూ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. రాజకీయంగా ఎంతో సంచలనం రేకెత్తించిన స్వర్ణప్యాలెస్ ఘటనపై మరోసారి పోలీసులు దృష్లిసారించేందుకు అవకాశం వచ్చినట్టయింది. అగస్టు 9 తెల్లవారుజాము సమయంలో విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో ఘోర అగ్నిప్రమాదం. సుమారు 12 మంది పొగలో ఊపిరాడక మరణించారు. వీరంతా అతిథులు కాదు.. రమేష్ ఆసుపత్రి సారథ్యంలో కొవిడ్19కు చికిత్స పొందుతున్న బాధితులు. దీంతో కేసు ప్రతిష్ఠాత్మకంగా మారింది. పెరుగుతున్న కరోనా కేసులతో పలు ఆసుపత్రులు ఫంక్షన్ హాళ్లు, హోటల్స్‌ను అద్దెకు తీసుకుని కొవిడ్ ఆసుపత్రులుగా మార్చాయి. అదే దారిలో స్వర్ణప్యాలెస్‌ను అద్దెకు తీసుకున్న రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కొవిడ్ సెంటర్‌ను ప్రారంభించింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా, కనీసం హోటల్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఘోరం జరిగిపోయింది. 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 8 మందికి కొవిడ్19 పాజిటివ్ లేకపోయినా లక్షల రూపాయలు గుంజి మరీ వైద్యం అందించినట్టు దర్యాప్తులో గుర్తించారు.
క్రమంగా దీనికి రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ అనుకూలమైన కమ్మవర్గం కావటం వల్లనే వైసీపీ కక్ష సాధిస్తుందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. సినీనటుడు రామ్ కూడా ట్వీట్లతో వైసీపీ ప్రభుత్వంపై చురకలు వేశాడు. దీనికి ప్రతిగా పోలీసులు హీరోకు గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో సైలెంట్ అయ్యాడు. కేసులో కీలక నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న స్వర్ణప్యాలెస్ యజమాని, రమేష్ ఆసుపత్రి యజమాని ఇద్దరూ హైకోర్టు నుంచి స్టేటస్ కో తెచ్చుకున్నారు. దీంతో కేసు దర్యాప్తు నిలిచి పోయింది. హైకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆదేశించింది. తాజాగా సుప్రీం హైకోర్టు ఆదేశాలను నిలపివేస్తూ దర్యాప్తు చేసేందుకు సంస్థలకు అనుమతినిచ్చింది.