ముందుగా ప్రకటించిన 25మిలియన్ డాలర్లలో 15 మిలియన్ డాలర్లకు పైగా ఇప్పుడు పెట్టుబడి పెట్టడం ద్వారా దాదాపు 80వేల మంది మహిళలు సహా 1,40,000 మంది రైతులు ప్రయోజనం పొందగలరు
న్యూఢిల్లీ, ఇండియా, సెప్టెంబర్ 17, 2020 ః భారతదేశం మహమ్మారి నుంచి కోలుకోవడంలో సన్నకారు రైతుల ఆవశ్యకతను గుర్తించిన వాల్‌మార్ట్ ఫౌండేషన్ నేడు రెండు నూతన గ్రాంట్లను ప్రకటించింది. భారతదేశంలో రైతుల జీవనోపాధిని ఐదేళ్లలో మెరుగుపరచడానికి 25 మిలియన్ డాలర్లను (దాదాపు 180 కోట్ల రూపాయలు) పెట్టుబడిగా పెడతామని సెప్టెంబర్ 2018వ సంవత్సరంలో చాటిన నిబద్ధతలో భాగంగా ఈ గ్రాంట్లు ఉండనున్నాయి. ఈ నూతన ఫండింగ్ మొత్తంమ్మీద 4.5 మిలియన్ డాలర్లుగా ఉండటంతో పాటుగా లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు తనేజర్ (Tanager) , ప్రదాన్ (PRADAN) మరింతగా తమ ప్రయత్నాలను వృద్ధి చేయడం ద్వారా రైతులు మెరుగైన దిగుబడులు, సరైన మార్కెట్ ప్రాప్యత ద్వారా లబ్ధి పొందేందుకు సహాయపడనుంది. ఈ రెండు గ్రాంటీలూ రైతు నిర్మాణ సంస్ధలు (ఎఫ్పీఓలు) ద్వారా మహిళా రైతులకు మెరుగైన అవకాశాలను అందించడంపై దృష్టి సారిస్తారు.
ఈ రెండు నూతన గ్రాంట్స్‌తో వాల్‌మార్ట్ ఫౌండేషన్ మొత్తంమ్మీద 15 మిలియన్ డాలర్లను భారతదేశంలోని ఎనిమిది లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు)కు అందించడంతో పాటుగా సహకార కార్యక్రమాల రూపకల్పన ద్వారా 1,40,000 మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుంది. వీరిలో ఇప్పటి వరకూ 80వేల మందికి పైగా మహిళలు సైతం ఉన్నారు.
కాథ్లీన్ మెక్లౌఫ్లిన్, ప్రెసిడెంట్ ఆఫ్ వాల్‌మార్ట్ ఫౌండేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్ – వాల్‌మార్ట్ ఐుఽఛి., మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయంగా వృద్ధి చెందుతున్న కోవిడ్–19 మహమ్మారి భారతీయ రైతులపై కూడా ఒత్తిడి పెంచుతుంది. మరీ ముఖ్యంగా రాత్రికి రాత్రి ఆదాయం పడిపోవడంతో మహిళా రైతుల భుజ స్కందాలపై అదనపు బాధ్యతలు వచ్చిచేరాయి. వాల్‌మార్ట్ ఫౌండేషన్ వద్ద మేము మరియు మా గ్రాంటీ భాగస్వాములు రైతుల మెరుగైన భవిష్యత్ కోసం వారి స్థిరత్వం వృద్ధి చేయడంపై దృష్టి సారించాము’’ అని అన్నారు
కళ్యాణ్ కృష్ణమూర్తి, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు వాల్‌మార్ట్ ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మెంబర్ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో ఉత్పాదకతను వృద్ధి చేయడానికి మరియు దిగుబడి పెంచడానికి, విలువైన మార్కెట్ సమాచారం పొందేందుకు మరియు మరింత సమర్థవంతమైన, పారదర్శక సరఫరా చైన్‌తో విజయవంతం కావడానికి రైతులకు సహాయపడటంలో సృజనాత్మక సాంకేతికతలకు అపారమైన అవకాశాలున్నాయి. రైతులకు సాధికారిత అందించడంతో పాటుగా వారిని డిజిటల్ యుగంలోకి తీసుకురావడానికి వాల్‌మార్ట్ ఫౌండేషన్ యొక్క వ్యూహంలో అత్యంత కీలకంగా ఎఫ్పీఓలు నిలువనున్నాయి’’ అని అన్నారు.
తమ గ్రాంట్స్ ద్వారా వాల్‌మార్ట్ ఫౌండేషన్ ఇప్పుడు ఎఫ్పీఓలకు మద్దతునందిస్తున్న ఎన్జీవోలతో కలిసి పనిచేయడం ద్వారా వారి సామర్థ్యంలను వృద్ధి చేస్తూనే మరింత మంది సభ్యులకు విస్తరిస్తుంది. మొత్తంమ్మీద మా లక్ష్యం స్థిరమైన వ్యవసాయ విధానాల కోసం ఎఫ్పీఓలకు జ్ఞానం అభివృద్ధి చేయడంలో సహాయపడటంతో పాటుగా అత్యుత్తమ వ్యాపార ప్రక్రియలను పంచుకోవడం, ప్రాధమిక వ్యవసాయ సరుకులకు అదనపు విలువను జోడించడం మరియు ఫైనాన్స్ మరియు మార్కెట్లకు అదనపు ప్రాప్యతను అందించడం.
భారతదేశంలో కోవిడ్–19 లాక్డౌన్ వేళ మరియు ప్రస్తుత ఆర్థిక పురోగమన వేళ అత్యంత కీలకమైన పాత్రను ఎన్జీవోలు మరియు వారి ఎఫ్‌పీఓ భాగస్వాములు పోషిస్తున్నారు. వాల్‌మార్ట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో, వారు ఆహారం మరియు పరిశుభ్రతా సరఫరాల కోసం అత్యావసరాలను తీర్చగలగడం, సురక్షిత అమ్మక మార్గాలను నిర్వహించడం, వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతునందించడం మరియు వ్యవసాయ వైవిధ్యతను ప్రోత్సహిస్తూ శిక్షణా కార్యక్రమాలు కొనసాగించడం మరియు వారిని డిజిటల్ వేదికలపై తీసుకురావడం ద్వారా వాతావరణ–స్మార్ట్ ఉత్పత్తి ప్రక్రియల వైపు మళ్లించడం చేస్తున్నారు.
మహిళా రైతులకు మద్దతునందిస్తూ నూతన గ్రాంట్స్
వాల్‌మార్ట్ ఫౌండేషన్ గ్రాంట్స్ యొక్క తాజా గ్రాంట్‌లో అంతర్జాతీయ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ తనేజర్ (Tanager) 2.6 మిలియన్ డాలర్లకు పైగా అందుకోనుంది. తద్వారా తమ విజయవంతమైన ఫార్మర్ మార్కెట్ రెడీనెస్ ప్రోగ్రామ్ ను విస్తరించడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు మరింతగా తమ జ్ఞానం, వనరులు, పరిశోధనను విస్తరించేందుకు సహాయపడనుంది. ఈ కార్యక్రమం యొక్క రెండవ దశలో 13 ఎఫ్పీఓల సుస్థిరతలను బలోపేతం చేయడంపై దృష్టిపెడుతుంది. ఈ 13 ఎఫ్‌పీఓలలో 7 ఈ కార్యక్రమానికి కొత్తవి. 5600 మంది మహిళా రైతులతో సహా 15వేల మంది రైతులు తమ ఉత్పాదకత, లాభదాయతకలను వృద్ధి చేసుకోవడంలో సహాయం పడనున్నారు.
మొదటి దశ ఫార్మర్ మార్కెట్ రెడీనెస్ ప్రోగ్రామ్‌ను 2017 మరియు 2020 సంవత్సరాల నడుమ అమలు చేశారు. దీని కోసం వాల్‌మార్ట్ ఫౌండేషన్ 2 మిలియన్ డాలర్ల గ్రాంట్‌ను అందజేసింది. దీనిని 25 మిలియన్ డాలర్ల నిబద్ధతలో జోడించలేదు. తనేజర్ ప్రకారం ఫేజ్ 1 లో 5600 మంది మహిళా రైతులతో సహా 17500 మంది రైతులు తమ దిగుబడులు వృద్ధి చేసుకోవడంతో పాటుగా తమ ఉత్పత్తిని మార్కెట్ చేసుకోగలిగారు. ఈ కారణం చేత 8500 మెట్రిక్ టన్నుల దిగుబడిని విక్రయించడం ద్వారా 3 మిలియన్ డాలర్లు (220 మిలియన్ రూపాయలు) సంపాదించగలిగారు.
‘‘భారతదేశంలో ఆర్ధికాభివృద్ధికి సన్నకారు రైతులు మరియు ఎఫ్పీఓలు అత్యవసరం. వాల్‌మార్ట్ ఫౌండేషన్ నుంచి గ్రాంట్ ఫండింగ్ మద్దతుతో కార్యక్రమ రెండవ దశలో రైతుల కోసం మార్కెట్ ప్రాప్యతను వృద్ధి చేయడాన్ని తనేజర్ కొనసాగించనుంది. అదే సమయంలో నూతన పంటలు, ఆదాయ మార్గాలను సైతం జోడించడం ద్వారా కోవిడ్–19 మహమ్మారి వేళ రైతు కుటుంబాలకు మద్దతును విస్తరించనుంది. మా అంతిమ లక్ష్యం, ఎఫ్‌పీఓలను ప్రాజెక్ట్ జీవితానికి మించి వృద్ధి చెందగల సుస్థిర వ్యాపారాలుగా అభివృద్ధి చేయడం’’ అని అమిత్ కుమార్ సింగ్, తనేజర్ టీమ్ లీడ్, ఇండియా అన్నారు.
ఢిల్లీ కేంద్రంగా కలిగిన లాభాపేక్ష లేని సంస్థ ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ (PRADAN) తమ వాల్‌మార్ట్ ఫౌండేషన్ గ్రాంట్ 1.9 మిలియన్ డాలర్లను తమ లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ త్రూ మార్కెట్ యాక్సెస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ (LEAP) కార్యక్రమంను తూర్పు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్‌లో ప్రారంభించనుంది. నూతన వ్యవసాయ విధానాలను స్వీకరించేందుకు, వారి ఉత్పత్తిని వైవిధ్యపరచడానికి మరియు వారి ఉత్పాదకతను వృద్ధి చేయడానికి ఎఫ్పీఓలతో కలిసి పనిచేసేలా మహిళలకు మద్దతునందించడంపై లీప్ దృష్టి కేంద్రీకరించింది.
గిరిజనులు మరియు బలహీన వర్గాలకు చెందిన మహిళా రైతులకు మద్దతునందించడంపై దృష్టి కేంద్రీకరించిన ప్రదాన్ యొక్క వాల్‌మార్ట్ ఫౌండేషన్ నిధులు సమకూర్చిన లీప్ కార్యక్రమం ప్రత్యక్షంగా 45వేల మంది మహిళా రైతులతో సహా 2,25,000 మంది ప్రజలకు మద్దతునందించనుందని అంచనా.
‘‘అట్టడుగు వర్గాల ప్రజల కోసం అవకాశాలను సృష్టించడం ద్వారా స్థిరమైన కమ్యూనిటీలను నిర్మించాలనే లక్ష్యాన్ని వాల్‌మార్ట్ ఫౌండేషన్ మరియు ప్రదాన్ పంచుకుంటున్నాయి. లీప్ ప్రాజెక్ట్‌తో , మారుమూల ప్రాంతాలకు చెందిన మహిళా రైతులు ఎఫ్‌పీఓలను ఏర్పాటుచేసేలా శక్తివంతులను చేయడంతో పాటుగా బలమైన మరియు సరసమైన వస్తువుల విలువ గొలుసుల ద్వారా ఆధునిక ఆర్ధిక వ్యవస్ధకు సహాయపడటానికి మేము కలిసి పనిచేస్తున్నాము’’ అని నరేంద్రనాథ్ దామోదరన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రధాన్ అన్నారు.