గ్రేటర్ హైద్రాబాద్ కు భారీ వర్ష సూచన.రానున్న మూడు గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు GHMC సూచన చేసింది. పిడుగులు పడే అవకాశం కూడా వుందని ప్రకటించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని నగర ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేసారు . అత్యవసర పరిస్థితి ఏర్పడితే 040 29555500, 040 21111111 కు సమాచారం ఇవ్వండి.