ఏడుకొండలు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. అలిపిరి వద్ద శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. నడకదారిన వెళ్లేవారికి అనుమతి ఇవ్వటంతో నిబంధనల ప్రకారం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొద్దినెలలుగా లాక్‌డౌన్ ఆంక్షలతో స్వామివారి దర్శనం భక్తులకు దూరమైంది. ఇటీవలే లడ్డూప్రసాదం పంపిణీ చేయటం ద్వారా భక్తులకు కాస్త సంతృప్తి దొరికింది. తాజాగా ప్రభుత్వం ఆంక్షలు సడలించటంతో నియమిత సంఖ్యమేరకు భక్తులను అనుమతిస్తున్నారు. ఇతర రాష్ట్ర భక్తులను నిబంధనల ప్రకారం పరీక్షించి తరువాత అనుమతినివ్వనున్నారు. ముఖ్యప్రాంతాల్లో శానిటైజేషన్ చేస్తున్న టిటిడి సిబ్బంది మాస్కులుంటేనే తిరుమలకు అనుమతి చేస్తూ ఆదేశాలు జారీచేశారు.