ఓడినా ఓ కిక్ ఉంటుందంటే ఏమో అనుకుంటాం.. ఇది చూస్తే నిజ‌మే అనుకోవాల్సిందే!

అదో ప‌రుగు పందెం.. గెలుపు కాస్త ద‌గ్గ‌ర‌య్యే కొద్దీ తెలియ‌ని ఒత్తిడి ఉంటుంది.. అదే విజ‌యం జ‌స్ట్ అంటూ ప‌క్క‌కు జ‌రిగితే అబ్బో ఊహించ‌ట‌మే క‌ష్టం క‌దూ! ఓట‌మి అంత‌గా భ‌య‌పెడుతుంది. కానీ.. ఒక ప‌రుగు పందెంలో తాను గెలిచే అవ‌కాశం ఉన్నా.. స‌హ‌చ‌రుడు గెలుపు కోసం ప‌క్క‌కు జ‌రిగి ఓ క్రీడాకారుడు నిజంగా స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఏమిటో చూపాడు. అయితే ఇది మ‌న‌దేశంలో కాదండోయ్‌.. స్పెయిన్‌లోని నార్త‌ర‌న్ స్పానిష్ న‌గ‌రంలో ఇటీవ‌ల శాంటాడ‌ర్ ట్ర‌యాథ్ల‌న్ 2020 సంద‌ర్భంగా అథ్లెటిక్స్ పోటీలు జ‌రిగాయి. ప‌రుగు పోటీలో బ్రిట‌న్ క్రీడాకారుడు జేమ్స్ టీగ‌ల్‌, స్పెయిన్ అథ్లెట్ డియాగో మెటిండ్రా ముందు వ‌రుస‌లో ఉన్నారు. కొద్ది సెక‌న్ల‌లో గ‌మ్యం చేరుతామ‌నేలోపుగా.. చిన్న పొర‌పాటు జ‌రిగింది. మొద‌టి స్థానం ద‌క్కించుకునే స్థానంలో ఉన్న బ్రిట‌న్ క్రీడాకారులు జేమ్స్ టీగ‌ల్ వ‌రుస త‌ప్పి.. ముందుగా ఉన్న బారీకేడ్స్‌ను ఢీకొట్టాడు. అయితే ముందుగా వచ్చిన స్పెయిన్ అథ్లెట్ మెటిండ్రా ఇది గ‌మ‌నించి లైన్ వ‌ద్ద‌నే నిలిచాడు వెనుక‌గా వ‌చ్చిన త‌న ప్ర‌త్య‌ర్థికి గెలిచే అవ‌కాశం ఇచ్చాడు. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. గెలిచినా.. లేని ఆనందాన్ని ఓడి మ‌రీ సొంతం చేసుకున్న క్రీడాకారుడి స్పూర్తి నిజంగానే ఆద‌ర్శం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here