చిరంజీవి.. ఆచార్యతో మళ్లీ బిజీగా మారారు. వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. అభిమానులను అలరిస్తూనే కొత్త తరహా ప్రయోగాలు చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. కోట్లాదిమంది ప్యాన్స్కూ మెగాస్టార్ సినిమా అంటే పెద్ద పండుగ. దసరా, సంక్రాంతికి అన్నయ్య సినిమా కోసం ఎందరో తమ్ముళ్లు ఎదురు చూస్తుంటారు. ఖైదీనెంబరు 150, సైరా నరసింహారెడ్డితో చిరు అంటే ప్రేక్షకుల్లో అభిమానం చెక్కుచెదరలేదనేది అర్ధమైంది. ఆ గ్రేస్ కూడా అలాగే ఉందనేది ఇప్పటి హీరోలు చిరును పోటీగానే భావిస్తున్నారు. తెలుగు పరిశ్రమకు పెద్దన్నగా అన్నీతానై నడిపిస్తున్నారు. గిట్టని కొందరు వ్యతిరేకత ప్రచారంతో దెబ్బతీయాలని పన్నాగాలు కూడా మెగాస్టార్‌ను ఏమి చేయలేకపోతున్నాయంటూ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. ఆచార్య తరువాత ఏ సినిమా చేస్తారంటే.. లూసిఫర్ రీమేక్ అనే పేరు వినిపిస్తోంది. యువ దర్శకులతో వరుసగా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో కథలు కూడా వింటున్నారట. అయితే లూసిఫర్ విషయమంలోనే కాంబినేషన్ సరిగా సెట్ అవ్వట్లేదు. మొదట దర్శకుడు సుజిత్ అనుకున్నారు. కానీ ఆయన దాన్ని హ్యాండిల్ చేయలేరనే ఉద్దేశంతో వి.వినాయక్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. మెగాస్టార్ చెల్లెలుగా ఎవర్ని తీసుకోవాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మెగాస్టార్ సరసన హీరోయిన్గా చేస్తే కెరీర్ బావుంటుందని భావించే హీరోయిన్లు కొందరు సిస్టర్ క్యారెక్టర్ అనగానే సారీ చెబుతున్నారట. మొదట సాయిపల్లవి పేరు వినిపించినా.. ఇప్పుడు సుహాసిని, రమ్యకృష్ణలు అయితే బావుంటుందంటున్నారు. వీరిద్దరూ గతంలో చిరు సరసన హీరోయిన్లుగా చేశారు. 1980ల్లో చెల్లెలు పాత్రల్లోనూ మెప్పించారు. చక్రవర్తి సినిమాలో చిరంజీవి చెల్లిగా రమ్యకృష్ణ నటిస్తే.. ఇంటిగుట్టు సినిమాలో చిరు సిస్టర్‌గా సుహాసిని కనిపించారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో వీరిద్దరూ హీరోయిన్లుగా హిట్ కాంబినేషన్ అనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరిలో మరోసారి ఎవరు సిస్టర్‌గా మెగాస్టార్ పక్కన నటిస్తారనది ఆసక్తిగా మారిందన్నమాట.



