• వినియోగదారులు నిర్థిష్టమైన విభాగాలలో ఉత్పత్తులను అక్టోబర్ 11–అక్టోబర్ 14 మధ్యకాలంలో ఎంపిక చేసుకునే అవకాశం ; వీటిని అతి తక్కువగా ఒక్క రూపాయికే ముందుగా బుక్ చేసుకోవచ్చు
• బ్యూటీ, హోమ్, లైఫ్‌స్టైల్, యాక్ససరీ వంటి విభాగాల వ్యాప్తంగా ప్రీ బుక్ స్టోర్ల ద్వారా లక్షలాది ఉత్పత్తులపై పండుగ ఆఫర్లను విక్రేతలు విడుదల చేశారు
బెంగళూరు, అక్టోబర్ 09,2020 ః భారతదేశంలో వృద్ధి చెందిన ఈ–కామర్స్ మార్కెట్ ప్రాంగణం ఫ్లిప్‌కార్ట్ రాబోతున్న పండుగ సీజన్ అమ్మకాలు – ద బిగ్ బిలియన్ డేస్‌కు పూర్తిగా సిద్ధమైంది. అక్టోబర్ 16వ తేదీ నుంచి ఈ అమ్మకాలు జరుగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక విక్రయ కార్యక్రమం లక్షలాది మంది విక్రేతలు, ఆర్టిషియన్లు మరియు బ్రాండ్లను ఒకే దరికి తీసుకురావడంతో పాటుగా విస్తృతశ్రేణి ఉత్పత్తులను 250 మిలియన్లకు పైగా తమ వినియోగదారులకు అందించనుంది. ఈ విక్రయ కార్యక్రమానికి ముందుగా ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు తమ వినియోగదారులకు వినూత్నమైన అవకాశాన్ని తమ అభిమాన ఉత్పత్తుల కొనుగోలు కోసం ముందస్తు బుకింగ్ ఆఫర్ అందించడంతో పాటుగా తమ షాపింగ్ కార్ట్‌ను నిర్మించుకునే అవకాశం అందిస్తుంది. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 14 వరకూ అందుబాటులో ఉండే ఈ ప్రీ బుక్ స్టోర్ ద్వారా వినియోగదారులు తమ ఆర్డర్లను కనీస మొత్తం ఒక్కరూపాయి చెల్లించి బుక్ చేసుకోవచ్చు. తద్వారా వినియోగదారులు తమ అభిమాన ఉత్పత్తులను అవి పూర్తిగా విక్రయించబడక మునుపే పొందే అవకాశం పొందుతారు. ఒకసారి బుకింగ్ నిర్థారించబడిన తరువాత, వినియోగదారులు ఈ వేదికపైకి బిగ్ బిలియన్ డేస్ తొలి రోజు అంటే అక్టోబర్ 16వ తేదీన రావడంతో పాటుగా మిగిలిన మొత్తాన్ని పలు ఆన్లైన్ చెల్లింపు మార్గాల ద్వారా లేదా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా చెల్లించి కోరుకున్న ఉత్పత్తిని పొందవచ్చు.
నందితా సిన్హా, వైస్ ప్రెసిడెంట్–ఈవెంట్స్, ఎంగేజ్మెంట్ అండ్ మర్చండైజింగ్–ఫ్లిప్‌కార్ట్ మాట్లాడుతూ ‘‘ఈ బిగ్ బిలియన్ డేస్ కోసం మేము ఎన్నో నూతన అంశాలను మొట్టమొదటిసారిగా భారతీయ వినియోగదారుల కోసం తీసుకువచ్చాం. ఈ ప్రీ బుక్ స్టోర్ ఆ తరహా ఒక కార్యక్రమం. దీని ద్వారా వారి షాపింగ్ అనుభవాలు మరింత అర్థవంతంగా మారగలవని నమ్ముతున్నాం. వినియోగదారులు కేవలం బిగ్ బిలియన్ డేస్ యొక్క ఆఫర్లను ముందుగా చూడటం మాత్రమే కాదు, కేవలం ఒక్క రూపాయి చెల్లించి తమ కొనుగోళ్లను ముందుగా ప్రణాళిక చేసుకోవచ్చు’’ అని అన్నారు.
ఈ సంవత్సరం, పరిశ్రమ నివేదికల ప్రకారం, పండుగ సీజన్ షాపింగ్ కోసం వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ ఉండనుంది. దాదాపు 45–50 మిలియన్ మంది షాపర్లు ఆన్లైన్లో ఈ సీజన్‌కు రానున్నారని అంచనా. ఎంఎస్ఎంఈలు, విక్రేతలు, ఆర్టిషియన్లు, హ్యాండిక్రాఫ్ట్ తయారీదారులు రాబోతున్న పండుగ సీజన్‌ను అందుకోవడం కోసం పూర్తిగా సంసిద్ధులయ్యారు ; అదే సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలనూ వారు తీసుకున్నారు. ఈ ప్రీ బుక్ స్టోర్ ద్వారా వినియోగదారులు నుంచి సంభావ్య డిమాండ్‌ను సైతం విక్రేతలు చూడటం సాధ్యమవుతుంది. తద్వారా వారు తమ స్టాక్స్‌ను ప్రణాళిక చేసుకుని, మరింత సమర్థవంతంగా డెలివరీ చేయడమూ సాధ్యమవుతుంది.
జగజ్జీత్ హరోడీ, సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్– మార్కెట్‌ప్లేస్, ఫ్లిప్‌కార్ట్ మాట్లాడుతూ ‘‘ మా సెల్లర్ భాగస్వాములు భారతీయ వినియోగదారులకు విస్తృతశ్రేణి ఉత్పత్తులను తీసుకురావడానికి చురుగ్గా పనిచేస్తున్నారు.
వినియోగదారుల డిమాండ్‌ను అర్థం చేసుకోవడం ద్వారా, మా పండుగ సీజన్లో దుకాణదారుల అవసరాలను సమర్థవంతంగా నెరవేర్చడానికి వీలు కల్పించే అవకాశాలను మా అమ్మకందారులు కలిగి ఉన్నారని మేము నిర్థారించాలనుకుంటున్నాం. ఈ ప్రీ బుక్ స్టోర్‌తో విక్రేతలు, ఆర్టిషియన్లు, చేనేతకారులు భారతదేశం ఏమి కోరుకుంటుందో దానిని ఈ అమ్మకం కార్యక్రమంలో కొనుగోలు చేసేందుకు అందించడంతో పాటుగా బిగ్‌బిలియన్ డేస్ కార్యక్రమంలో వినియోగదారులకు పండుగ ఆనందాన్ని సైతం అందించగలరు’’ అని అన్నారు.
వినియోగదారులు లక్షలాది ఉత్పత్తులను విభిన్నమైన విభాగాలైనటువంటి గృహ, జీవనశైలి, అందం, బేబీకేర్, ఎలకా్ట్రనిక్ యాక్ససరీలు వంటి వాటిని ఈ ప్రీ బుక్ కలెక్షన్లో భాగంగా పొందగలరు.



