కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు చానాళ్ల తరువాత హీరోగా కనిపించబోతున్నారు. తొలిసారిగా టాలీవుడ్లో భిన్నమైన కథాంశంతో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా మొదలైంది. అగస్టు 15 రోజున పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేస్తూ వచ్చారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంగీతం ఇళయరాజా వహిస్తున్నారు. దేశభక్తి స్పూర్తిని నింపే సినిమా ద్వారా గొప్ప సందేశం కూడా ఇవ్వబోతున్నారు. గతంలోనూ పుణ్యభూమి నాదేశం సినిమా ద్వారా మోహన్‌బాబు అద్భుతంగా మెప్పించారు. ఇప్పటికీ ఆ సినిమా డైలాగ్‌లు అదరగొడుతుంటాయి. ఈ సినిమాలో మరో విశేషమేమిటంటే.. మంచు విష్ణు సతీమణి మంచు విరానికా మోహన్‌బాబు అంటే మామగారికి స్టైలిస్ట్‌గా వ్యవహరించటమే. మంచు ఇంటి నుంచి నటవారసులుగా వచ్చిన విష్ణు, మనోజ్‌లు అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. కానీ.. ఇండస్ట్రీలో ప్రయోగాలకు తాము సిద్ధమని చాటుకున్నారు. మంచు లక్ష్మి నిర్మాతగా, నటిగా పేరు సంపాదించుకున్నారు.