చెట్టు.. పుట్ట.. పశుపక్ష్యాదులు.. చుట్టూ ఉండే ప్రకృతిని పూజించటం.. కొలవటం.. భారతీయత. కొందరు దాన్ని మూఢనమ్మకం అనుకున్నా.. దానిలో అంతర్గతంగా దాగిన శాస్త్రీయత మనకు మాత్రమే తెలిసిన నిజం. కాళ్లకు పసుపు రాసుకుంటే అబ్బే అనేవాళ్లు. చద్దన్నం తింటుంటే.. వెనుకబడ్డారన్నారు. కానీ.. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు అదే అనుసరిస్తున్నాయి. కరోనాకు విరుగుడు మంత్రం మన ఆయుర్వేదం అంటే అందరూ నోరెళ్లబెడుతున్నారు. అదే దారిలో ఇప్పుడు.. గోమాత గొప్పతనం ప్రపంచం గుర్తిస్తోంది. ఆవులో ఉండే పాజిటివ్ ఎనర్జీ శరీరంలోని మలినాలను.. మనసులోని మాలిన్యాలను దూరం చేస్తుందనే విషయాన్ని నమ్ముతున్నారు. అందుకే.. కౌ థెరపీ.. అదేనండీ.. గోమాత కౌగిలింత మనసుకు ఆనందాన్ని.. శరీరంలోని దోషాలను దూరం చేస్తుందంటూ పరుగులు తీస్తున్నారు. నెదర్లాండ్‌లో తన ఫామ్ హౌస్‌లో కౌ హగ్గింగ్ థెరపీతో జోన్ వన్ స్ట్రాలెన్ ప్రారంభించారు. ఇప్పుడు దానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వాస్తవానికి కౌగిలింతలోనే బోలెడంత భరోసా ఉంటుంది. మనసుకు ఒత్తిడిని దూరం చేసే మంత్రం కూడా హగ్గింగ్. అందాకా ఎందుకు.. ఉలికిపడే బుజ్జాయిని ఒళ్లోకి తీసుకుని అమ్మ ధైర్యాన్నిస్తుంది. తల్లి పొత్తిళ్లలో ఒదిగిన బిడ్డ రిలాక్స్ అవుతాడు. స్నేహితుడు కనిపిస్తే.. ఆలింగనమే అసలు సిసలైన పలుకరింపు. కానీ.. కరోనాతో అన్నీ దూరమయ్యాయి. కానీ.. గోవుతో హగ్గింగ్ మాత్ర పాపులర్ అయింది. కౌ థెరపీ గా ఇప్పుడు వెస్ట్రన్ దేశాల్లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంటుంది. ఇండియాలో భారతీయులు తప్పనిసరిగా పండుగ వేళ్లలో గోమాతను పూజించటం ఆచారంగా మార్చుకున్నారు. ఇప్పుడు దాన్ని విదేశీయులు వైద్యమార్గంగా అనుసరిస్తున్నారన్నమాట.