మెగా ఫ్యామిలీలో సాయిధరమ్‌తేజ్ స్టయిల్ డిఫరెంట్. కథల ఎంపికలో మేనమామ చిరంజీవి కూడా జోక్యం చేసుకోవటంతో వరుసగా హిట్టు కొడుతూ వస్తున్నాడు. సోలో బతుకే సో బెటర్ సినిమా ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకుంది. థియేటర్లకు అనుమతి ఇవ్వగానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కట్టా దేవా దర్శకత్వంలో కొత్త సినిమాకు మెగా హీరో సంతకం చేశారట. ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టుగా ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుంది. రిపబ్లిక్ టైటిల్ దాదాపు రిజిస్ట్రర్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఏమైనా.. సాయి తేజ్ వేగం.. చూస్తుంటే.. వెండితెరపై మామకు తగిన అల్లుడుగా నిలబడటం ఖాయమంటున్నారు అభిమానులు. మరో విశేషమేమిటంటే.. ఈ సినిమాలో ఐఏఎస్ అధికారిగా మెప్పించబోతున్నాడట మన మెగా హీరో సాయితేజ్.



